ఫ్రస్టేషన్.. చిరాకు, కోపం వచ్చేవి: రాశి ఖన్నా
- IndiaGlitz, [Sunday,October 11 2020]
సక్సెస్‌తో సంబంధం లేకుండా రాణించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. అది రాశీఖన్నాయేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన పనేంటో తను చూసుకుంటూ వెళుతుంటుంది. నటనను అత్యంత ప్రేమించే రాశిఖన్నా.. సక్సెస్, ఫెయిల్యూర్లను పెద్దగా పట్టించుకోదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలను ఓ ప్రముఖ పత్రికతో పంచుకుంది. ఈ సందర్భంగా లాక్డౌన్ టైమ్‌లో తన పరిస్థితి గురించి వెల్లడించింది.
మొదట్లో లాక్డౌన్ కొద్ది రోజులే ఉంటుందని భావించినట్టు రాశిఖన్నా తెలిపింది. కరోనా ఉద్ధృతి పెరగడంతో ఎప్పుడూ పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందట. మొదటి నెల ఓకే! రెండో నెల ఫ్రస్ట్రేషన్ మొదలయిందని... చిరాకు, కోపం వచ్చేవని రాశి వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాను పాత హాబీలను ప్రాక్టీసు చేయటం మొదలుపెట్టానని తెలిపింది. గిటార్ నేర్చుకోవడంతో పాటు... తమిళం కూడా నేర్చుకోవటం మొదలుపెట్టానని రాశి వెల్లడించింది. బెటర్ లుక్ కోసం జిమ్... సమయం గడవడం కోసం నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సిరీస్‌లు చూశానని.. ఇలా ఆ నెల కూడా గడిచిపోయిందని రాశి తెలిపింది.
ఇక మూడో నెలలోకి ప్రవేశించిన తర్వాత తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని... సమయాన్ని వృథా చేయకుండా కథలు వినటం మొదలుపెట్టానని రాశి వెల్లడించింది. బంధువులు, మిత్రులతో జూమ్ కాల్స్‌తో కలవటం మొదలుపెట్టడంతో చాలా రిలీఫ్ అనిపించిందని తెలిపింది. ఆరు నెలల తర్వాత సెట్లోకి అడుగుపెడితే- సొంత ఇంటికి వెళ్లినట్లనిపించిందని రాశి వెల్లడించింది. అంతే కాకుండా ఇప్పుడు తాను చేస్తున్నవన్నీ వైవిధ్యభరితమైన పాత్రలేనని.. ప్రస్తుతం తమిళంలో ‘మేధావి’, ‘ఆరన్మణై 3’ చేస్తున్నానని తెలిపింది. తెలుగులో మూడు సినిమాలు కథల స్టేజ్‌లు ఉన్నాయని. ఒక వెబ్ సిరీస్ చేస్తున్నానని. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ బిజీ అయిపోయానని రాశి వెల్లడించింది.