చలానాల ఫ్రస్టేషన్‌తో బైక్‌ను ఏం చేశాడో చూడండి!
Send us your feedback to audioarticles@vaarta.com
బండి రూటు మారినా.. అడ్డం దిడ్డంగా వాహనం వెళ్లినా ట్రాఫిక్ పోలీసులు తాట తీసేస్తున్నారు!. మరీ ముఖ్యంగా అతి వేగంగా వాహనం నడిపితే ఇక అంతే సంగతులు.. పొరపాటున ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని పట్టుకుని బండికి సంబంధించిన లైసెన్స్, ఆర్సీ లాంటివి అడిగినప్పుడు .. అవి లేకుంటే చలానాలే. ఆ చలానాలను ఏ మాత్రం ఆలస్యం చేసినా మళ్లీ తలనొప్పే.. సచ్చినట్లు డబ్బులు కట్టి తీరాల్సిందే. ఇలా ఇదిగో పక్కనున్న ఫొటోలో చూస్తున్న వాహనదారుడికి ఒకట్రెండు కాదు చాలానే చలానాలును విధించారు పోలీసులు. అయితే వాటన్నింటినీ కట్టకుండానే ఎంచక్కా బైక్‌పై తిరిగేస్తున్నాడు. మరోసారి పోలీసుల కంటపడటంతో మళ్లీ చలనా విధించారు.. దీంతో తీవ్ర అసహనానికి లోనైన ఆ వాహనదారుడు.. బండిని ఎత్తే పడేశాడు. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు బండిని తోసేయసాగాడు. అలా తోసేసి ఆఖరున ఆ బండిపైనే కూర్చోని బోరున ఏడ్చాడు. ఓ వైపు ఫ్రస్టేషన్‌తో మరోవైపు.. కంటతడి పెట్టడం గమనార్హం. అంటే ఈ చలనాలతో ఈ బైకర్ ఎంత విసిగిపోయాడో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
కన్నెర్ర జేస్తున్న వాహనదారులు, నెటిజన్లు!
అక్కడున్న పోలీసులు, తోటి వాహనదారులు, చుట్టు పక్కల జనాలు ఇదంతా సినిమా సీన్ అన్నట్లుగా తథేకంగా చూడసాగారే ఏ ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. అంతేకాదండోయ్.. కొందరైతే తమ ఫోన్ కెమెరాలకు పనిపెట్టి వీడియోలు చిత్రీకరించడం గమనార్హం. కాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. అయితే సీనంతా చూసిన పోలీసులు తీరిగ్గా.. ఆ బైకర్ ఏడుస్తుండగా దగ్గరికొచ్చి ఓదార్చడానికి యత్నించారు. పోలీసులు తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి చిన్నదానికీ చలనాలేంటి..? అసలు ఎందుకు చలానాలు వేస్తున్నారో అర్థమవుతోందా..? అంటూ పలువురు వాహనదారులు నెట్టింట్లో దుమ్మెత్తి పోస్తున్నారు.
కొత్త చట్టం వచ్చినప్పట్నుంచి చుక్కలే!
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్‌లో ఓ వ్యక్తి ట్రాఫిక్ చలనాలతో విసుగుచెందిపోయి తన సొంత వాహనానికి నిప్పుపెట్టిన విషయం విదితమే. ఒకట్రెండు వేలు కాదు.. ఏకంగా రూ.11,000 వేల రూపాయిలతో కూడిన రావడంతో విసుగుచెంది వాహనానికి నిప్పుపెట్టాడు. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 1 నుంచి మోటారు వాహనాల చట్టం ద్వారా అమలులోకి వచ్చిన విషయం విదితమే. ఈ చట్టం ప్రకారం.. నిర్లక్ష్య డ్రైవింగ్‌కు భారీ జరిమానా తప్పదు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఇకపై 500 రూపాయల జరిమానా కాదు.. లైసెన్స్ లేకుండా వాహనాలు పట్టుబడితే 5,000 రూపాయల జరిమానాను ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తున్నసంగతి తెలిసిందే. కాగా కొత్త వాహనాల చట్టం అమల్లోకి వచ్చినప్పట్నుంచి వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయ్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments