ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు.. అంతే క్షణాల్లో రూ.70 వేలు మాయం
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల ద్వారా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఏమార్గంలో నేరాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకునే లోపు డబ్బులు ఖాతాల నుంచి ఎగిరిపోతున్నాయి. మరీ ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ నేరాలు మరింత ఎక్కువవుతున్నాయి. కాలు కదపకుండా అన్ని పనులు ఆన్లైన్లోనే చేసుకునే వెసులుబాటును జనం భారీగానే ఉపయోగించుకుంటోంది. ఇది సైబర్ నేరగాళ్ల పాలిట వరం అవుతోంది.
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న వ్యక్తిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచేశారు. అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ లాగేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ల్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. కొద్ది నిమిషాల తర్వాత అతడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు తాము పంపించిన లింక్‌ను క్లిక్ చేస్తేనే ఆర్డర్ తీసుకుంటామని చెప్పారు. వారి మాటలు నమ్మిన వ్యక్తి ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. అంతే క్షణాల్లోనే అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.70వేలు మాయం అయ్యాయి. దీంతో అతడు తనకు వచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments