ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా టీవీల ముందే!
- IndiaGlitz, [Friday,December 06 2019]
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలోని నిందితులను శుక్రవారం తెల్లావారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరిగిందిని సామాన్యులు సైతం చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటన జరిగినట్లు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతం నుంచే అటు టీవీ చానెల్స్‌లో.. ఇటు వెబ్‌సైట్లలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.
దీంతో అసలేం జరిగింది..? నిందితులను నిజంగానే చంపేశారా.. లేకుంటే ఇంకేమైనా జరిగిందా..? అనే విషయాలను తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా టీవీలకే అతుక్కుపోయారు. ఏ ఇంట చూసినా టీవీల్లో ఇదే న్యూస్.. ఇదే హడావుడి. మరోవైపు టీవీలు అందుబాటులో లేని వాళ్లు యూ ట్యూబ్, వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున చూశారు. అంతేకాదు.. అటు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాదు.. తమదైన శైలిలో నెట్టింట్లో కామెంట్స్ రూపంలో రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు టీవీ చూసిన జనాలు ఈ ఘటనపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనాస్థలిలో.. దిశా ఇంటి దగ్గర బాణసంచా కాల్చి.. స్వీట్లు పంచి.. పండగ చేసుకుంటున్నారు.