విజయ్ కోసం ఆమె అభిమానం ‘హద్దు’లు దాటింది.
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ యువతి అభిమానం ‘హద్దు’లు దాటింది. ఆమె చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అసలే విజయ్‌కు అభిమానులు చాలా ఎక్కువ. ఆయన అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారు. ఈ సినిమా కోసం ఓ యువతి మలేషియా నుంచి రావడం ఒక ఎత్తైతే.. ఈ సినిమా కోసం ఏకంగా చెన్నైలో ఓ థియేటర్‌నే బుక్ చేయడం మరో ఎత్తు. విషయం తెలుసుకున్న తమిళ వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు.
మలేషియా నుంచి వచ్చిన యువతి పేరు ఆష్లినా. హీరో విజయ్ అంటే అంతులేని అభిమానం. తమిళనాడుకు చెందిన ఆష్లినా.. ప్రస్తుతం కుటుంబంతో సహా మలేషియాలో ఉంటోంది. అయితే విజయ్ సినిమా రిలీజయ్యిందంటే చాలు.. తొలిరోజు మొదటి ఆట చూడాల్సిందే. కానీ.. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మలేషియాలో ‘మాస్టర్’ సినిమా విడుదల కాలేదు. దీంతో ఏమాత్రం నిరుత్సాహ పడకుండా తన అభిమానాన్ని సరిహద్దులు దాటించేసి వార్తల్లో వ్యక్తిగా ఆష్లినా నిలిచింది.
ఆష్లినా తాజాగా విమానమెక్కి మలేషియా నుంచి చెన్నై వచ్చేసింది. సత్యం సినీ కాంప్లెక్స్‌లో మాస్టర్ సినిమా ఆడుతున్న థియేటర్లో ఒక షోకి సంబంధించిన టికెట్లన్నీ బుక్ చేసింది. బుధవారం కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి సినిమా వీక్షించింది. సినిమా చూసిన అనంతరం ఆష్లినా మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచే విజయ్‌కు వీరాభిమానినని, లాక్డౌన్ కారణంగా మలేషియాలో మాస్టర్ సినిమా విడుదల కాలేదని చెప్పింది. అందుకే చెన్నైకి వచచి చూశానని వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments