విజయ్ కోసం ఆమె అభిమానం ‘హద్దు’లు దాటింది.

  • IndiaGlitz, [Thursday,February 04 2021]

ఓ యువతి అభిమానం ‘హద్దు’లు దాటింది. ఆమె చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అసలే విజయ్‌కు అభిమానులు చాలా ఎక్కువ. ఆయన అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారు. ఈ సినిమా కోసం ఓ యువతి మలేషియా నుంచి రావడం ఒక ఎత్తైతే.. ఈ సినిమా కోసం ఏకంగా చెన్నైలో ఓ థియేటర్‌నే బుక్ చేయడం మరో ఎత్తు. విషయం తెలుసుకున్న తమిళ వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు.

మలేషియా నుంచి వచ్చిన యువతి పేరు ఆష్లినా. హీరో విజయ్‌ అంటే అంతులేని అభిమానం. తమిళనాడుకు చెందిన ఆష్లినా.. ప్రస్తుతం కుటుంబంతో సహా మలేషియాలో ఉంటోంది. అయితే విజయ్‌ సినిమా రిలీజయ్యిందంటే చాలు.. తొలిరోజు మొదటి ఆట చూడాల్సిందే. కానీ.. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మలేషియాలో ‘మాస్టర్‌’ సినిమా విడుదల కాలేదు. దీంతో ఏమాత్రం నిరుత్సాహ పడకుండా తన అభిమానాన్ని సరిహద్దులు దాటించేసి వార్తల్లో వ్యక్తిగా ఆష్లినా నిలిచింది.

ఆష్లినా తాజాగా విమానమెక్కి మలేషియా నుంచి చెన్నై వచ్చేసింది. సత్యం సినీ కాంప్లెక్స్‌లో మాస్టర్‌ సినిమా ఆడుతున్న థియేటర్‌లో ఒక షోకి సంబంధించిన టికెట్లన్నీ బుక్‌ చేసింది. బుధవారం కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి సినిమా వీక్షించింది. సినిమా చూసిన అనంతరం ఆష్లినా మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచే విజయ్‌కు వీరాభిమానినని, లాక్‌డౌన్‌ కారణంగా మలేషియాలో మాస్టర్‌ సినిమా విడుదల కాలేదని చెప్పింది. అందుకే చెన్నైకి వచచి చూశానని వెల్లడించింది.

More News

'డియర్ మేఘ' ఫస్ట్ లుక్ రిలీజ్

మేఘా ఆకాష్,అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ''డియర్ మేఘ''.

బర్త్‌డే సందర్భంగా రాజశేఖర్ ఎమోషనల్.. కొత్త సినిమా ప్రారంభం

చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హీరో రాజశేఖర్ 2017లో ఎంట్రీ ఇచ్చి ‘గరుడవేగ, కల్కి’ వంటి సినిమాలతో మరోమారు తన స్టామినాను రుజువు చేసిన విషయం తెలిసిందే.

నగ్న చిత్రం పోస్ట్ చెయ్యిమన్న నెటిజన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన పూజా హెగ్డే

హీరోహీరోయిన్లు అభిమానులకు చాలా దగ్గరగా ఉండటం కోసం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నారు.

‘రాహుల్ అనే నేను’.. స్టైల్ మార్చేశాను..!

ఎప్పుడూ సింపుల్‌గా.. వైట్ కలర్ పైజామా దుస్తుల్లో కనిపించే కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా స్టైల్ మార్చేశారు.

నిర్మాత‌ల‌కు థియేట‌ర్స్ యాజ‌మాన్యం ఆల్టిమేట్టం..!

దాదాపు ఏడెనిమిది నెల‌ల త‌ర్వాత థియేట‌ర్స్ మ‌ళ్లీ తెరుచుకున్నాయి. ముందు యాబై శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ అయిన థియేట‌ర్స్ త‌ర్వాత వంద శాతం