అక్కడ మిత్రులు..ఇక్కడ శత్రువులు...
Send us your feedback to audioarticles@vaarta.com
మహాభారతం అంటే మనకు గుర్తుకు వచ్చే గొప్ప పాత్రల్లో ధుర్యోధనుడు, కర్ణుడు. వీరిద్దరి స్నేహం చాలా గొప్పది. ధుర్యోధనుడుకి అహం ఎక్కువ, అభిమానధనుడు. కర్ణుడు గొప్ప వీరుడు అన్నీ మంచి లక్షణాలున్నా, చిన్న చిన్న లోపాలే శాపాలైనా వ్యక్తి. ఇదే మనస్థత్వాలను ఆధారంగా చేసుకని రెండు పాత్రలను క్రియేట్ చేసిన చిత్రమే అప్పట్లో ఒకడుండేవాడు. అయితే మహాభారతంలో ధుర్యోధనుడు, కర్ణుడు స్నేహితులైతే, సినిమాలో మాత్రం విరోధుల్లాగా చూపిస్తున్నామని దర్శకుడు సాగర్ కె.చంద్ర తెలిపాడు. ధుర్యోధనుడుగా నారా రోహిత్ నటిస్తుంటే, కర్ణుడు పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నారు. సినిమా 92-96 నేపథ్యంతో పాటు, ప్రస్తుతం సాగుతుంటుంది. ఫిక్షనల్ క్యారెక్టర్ బయోపిక్ సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. సినిమా డిసెంబర్ 30న విడుదలవుతుంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout