తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా 'ఫ్రెండ్స్ ఇన్ లా'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అమిత్ ఖన్నా దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్స్ ఇన్ లా' తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా మన ముందుకు రాబోతుంది. మన సమాజంలో సంకుచిత విషయంగా పరిగణించే స్వలింగ సంపర్కాన్ని ప్రథాన కథాంశంగా తీసుకొని తెరకెక్కించబడిన ఈ చిత్రాన్ని అమిత్ ఖన్నా, శ్రీదేవి చౌదరి మరియు స్వాతి సాంఘి (సాంఘి ఇండస్ట్రీస్ కుటుంబ సభ్యురాలు) నిర్మించారు.
ఆచారాలు, పట్టింపులు కలిగిన ఓ మహిళ స్వలింగ సంపర్కుడైన తన కొడుకు యొక్క జీవిత భాగస్వామితో కొన్ని రోజుల సావాసం తర్వాత ఆమె పరివర్తన ఎలా చెందుతుంది అనేదే 'ఫ్రెండ్స్ ఇన్ లా' కథ. సమాజంలో వివక్షకు గురి కాబడుతున్న స్వలింగ సంపర్కుల గురించి ఆరోగ్యకర చర్చ లేవెనెత్తె ఉద్దేశంతోనే చిత్రాన్ని నిర్మించినట్లు, వారి హక్కుల పై అవగాహన కల్పించి ఆలోచన రేకెత్తించే విధంగా 'ఫ్రెండ్స్ ఇన్ లా' ఉంటుందని నిర్మాతలు తెలిపారు.
ఎక్కువ శాతం ఇంగ్లీష్ లో మాటలుండే ఈ చిత్రాన్ని హైదరాబాద్ కు చెందిన హెచ్.ఆర్.హెచ్ బ్యానర్ పై నిర్మించారు. అనుయా చౌహన్ కుదేచ మరియు రితేష్ కుదేచ సహాయ నిర్మాతలుగా వ్యవహరించారు.
నిపుణులైన సాంకేతిక వర్గం పని చేసిన ఈ చిత్రానికి అద్వైత నెంలేకర్ సంగీతం సమకూర్చగా అజేయన్ ఛాయగాహకునిగా వ్యవహరించారు.
'ఫ్రెండ్స్ ఇన్ లా' ఓ విభిన్న కథాంశంమే అయినా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించబడిందని చెప్పుకొచ్చారు స్వాతి. ఓ మంచి సందేశాన్నిచ్చే చిత్రం తీశామని సంతృప్తిగా ఉందని దర్శకుడు అమిత్ అన్నారు. చిత్రంలో శ్రీదేవి చౌదరి మరియు బ్రిటిష్ నటుడు ఆష్లీన్ హ్యారిస్ ముఖ్య పాత్రలు పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments