ఫ్రెండ్ రిక్వెస్ట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్
- IndiaGlitz, [Sunday,June 19 2016]
మోడ్రన్ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మిస్తున్న యూత్‌ఫుల్ హారర్ ఎంటర్టైనర్ 'ఫ్రెండ్ రిక్వెస్ట్'. రోహిత్, ప్రకాష్, శీతల్, రిచాసోని, సాగరిక ఛైత్రి, మనీషా కేల్కర్, నితేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం ఓ ప్రత్యేక పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ జూన్ 19న హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ మాజీ ఛీఫ్ విప్, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, ప్రముఖ నిర్మాత అశోక్‌కుమార్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోలు రోహిత్, ప్రకాష్, హీరోయిన్ సాగరిక ఛైత్రి, పాటల రచయిత తైదలబాపు, మాటల రచయిత రాఘవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
సహ నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ - ''ఈ చిత్రాన్ని సోషల్ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించడం జరిగింది. సినిమాను జూలై ప్రథమార్థంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందించడం జరిగింది. చిన్న సినిమాలు రిలీజ్ అవడం కష్టంగా మారిన ప్రస్తుత తరుణంలో మా చిత్రం సగానికి పైగా ఏరియాలు బిజినెస్ కంప్లీట్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రంగా 'ఫ్రెండ్ రిక్వెస్ట్' రూపొందింది'' అన్నారు.
దర్శకుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ - ''సోషల్ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఓ మంచి సినిమా చెయ్యాలన్న ఆలోచనతో రెండు సంవత్సరాల క్రితం రాసుకున్న కథ ఇది. సోషల్ మీడియాకు యువత ఎలా బానిసగా మారుతోంది అనే అంశాన్ని తీసుకొని ఈ చిత్రాన్ని చేశాం. మంచి మెసేజ్ వుంటూనే అందర్నీ ఆకట్టుకునే హార్రర్ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ చిత్రంలో వున్నాయి. ఒక గొప్ప సినిమా చేశాం అని చెప్పను. కానీ, అందర్నీ ఆకట్టుకునే అంశాలతోపాటు యూత్‌కి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని మాత్రం చెప్పగలను. నేను చిన్న నిర్మాతనే అయినా క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో చేయడం జరిగింది. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను'' అన్నారు.
హీరో రోహిత్ మాట్లాడుతూ - ''ఆదిత్య ఓం గారితో కలిసి చేసిన ఈ జర్నీ ఎప్పటికీ మరచిపోలేం. సినిమాలో మెసేజ్‌తో పాటు అన్నీ ఎలిమెంట్స్ కలిపి చేసిన చిత్రం. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం'' అన్నారు.
హీరో ప్రకాష్ మాట్లాడుతూ - ''ఈ సినిమా చేయడం నిజంగా నా అదృష్టం. ఇందులో నాకు చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు ఆదిత్యగారు. ఆడియన్స్‌ని థ్రిల్ చేసే అన్ని అంశాలు ఈ సినిమాలో వున్నాయి'' అన్నారు.
తైదల బాపు మాట్లాడుతూ - ''6టీన్స్ నుండి నేటి పటాస్ వరకు నేను 400 పాటలను రాశాను. అయితే ఫేస్‌బుక్‌పై పాటను రాయడం నాకు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. ఆదిత్య ఓంగారు ఇప్పటి యూత్ ట్రెండ్‌కు తగిన విధంగా మంచి టైటిల్‌తో సినిమాను తెరకెక్కించారు'' అన్నారు.
సాగరిక ఛైత్రి మాట్లాడుతూ - ''తెలుగులో ఇది నా తొలి చిత్రం. ఆదిత్యగారి విజన్‌తోనే ఈ సినిమా సాధ్యమైంది. అందరం రెండేళ్లు కష్టపడి చేసిన మూవీ ఇది. ఈ సినిమాను సక్సెస్ చేసి మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం'' అన్నారు.
అశోక్‌కుమార్ మాట్లాడుతూ - ''ఒక నిజాయితీతో కూడిన ప్రయత్నమే ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రం. ట్రైలర్ చాలా బావుంది. ప్రతి ఫ్రేమ్ చాలా క్లారిటీతో ఉంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ హర్రర్ థ్రిల్లర్ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ - ''ఆదిత్య ఓం పడ్డ కష్టమే ఈ చిత్రం. ట్రైలర్ చాలా బాగుంది. రోహిత్ సహా అందరూ చక్కగా యాక్ట్ చేశారు. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ఆదిత్య ఓంకు, టీంకు మంచి పేరు తీసుకురావావాలి'' అన్నారు.
రోహిత్, ప్రకాష్, శీతల్, రిచాసోని, సాగరిక ఛైత్రి, మనీషా కేల్కర్, నితేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రాఘవ, సంగీతం: లవన్, వీరన్, కెమెరా: సిద్ధార్థ్, సహనిర్మాత, నిర్మాణ, నిర్వహణ: విజయవర్మ పాకలపాటి, నిర్మాణం: మోడ్రన్ సినిమా, కథ, దర్శకత్వం: ఆదిత్య ఓం.