ప్రజెంట్ యూత్ సైకాలజీయే మా ఫ్రెండ్ రిక్వెస్ట్ - ఆదిత్య ఓం
Thursday, July 7, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
లాహిరి లాహిరి లాహిరిలో..., ధనలక్ష్మి ఐ లవ్ యు, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు...తదితర చిత్రాల్లో నటించిన ఆదిత్య ఓం తాజా చిత్రం ఫ్రెండ్ రిక్వెస్ట్. నూతన నటీనటులతో ఆదిత్య ఓం తెరకెక్కించిన ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రం ఈనెల 8న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఆదిత్య ఓం తో ఇంటర్ వ్యూ మీకోసం...
ఫ్రెండ్ రిక్వెస్ట్ కాన్సెప్ట్ ఏమిటి..?
ప్రజెంట్ యూత్ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు. దీని వలన యూత్ సైకాలజీ ఎలా ఉంది అనేది బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాను. దీనికి ఎంటర్ టైన్మెంట్ & హర్రర్ మిక్స్ చేసి తీసాను. ఖచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నాను.
ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆలోచన ఎలా వచ్చింది..?
రెండు సంవత్సరాల క్రితం రెగ్యులర్ కధ కాకుండా విభిన్నంగా ఉండే స్టోరీతో సినిమా చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది. సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్ గా ఉందో తెలిసింది. అప్పుడు సోషల్ మీడియా పైనే సినిమా ఎందుకు చేయకూడదు అనుకుని ఈ కథ రెడీ చేసాను.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నేను ఈ చిత్రంలో గోస్ట్ సైకాలజిస్ట్ గా నటించాను. కథలో కీలకపాత్రగా ఉంటూనే కామెడీ చేసేలా ఈ పాత్ర ఉంటుంది. ఈ క్యారెక్టర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ పాత్ర 20 నిమిషాలే కనిపించినా...గుర్తుండిపోయే పాత్ర. అసలు ఈ పాత్రను వేరే ఆర్టిస్ట్ తో చేయించాలనుకున్నాను. నేను చేస్తేనే బాగుంటుందని యూనిట్ మెంబర్స్ చెప్పడంతో ఈ క్యారెక్టర్ చేసాను.
తెలుగు, హిందీలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులో రిలీజ్ చేయడానికి కారణం ఏమిటి..?
తెలుగులో సినిమా రెడీ అయ్యింది. హిందీలో ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది. అదీ కాకుండా ఈ సినిమా పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుచేత తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ చేసిన తర్వాత హిందీలో రిలీజ్ చేస్తే మంచి క్రేజ్ ఉంటుందనే ఉద్దేశ్యంతో ముందుగా తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. హిందీలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
నటుడుగా మీకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఏమిటి అనుకుంటున్నారు..?
నేను అనుకోకుండానే నటుడు అయ్యాను.నటుడు అయ్యాకా తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను కానీ.. ఎందుకనే రాలేదు. ఎందుకు అవకాశాలు రావడం లేదో కూడా తెలియదు. ఇప్పుడు నేను నటుడుగా కన్నా...రైటర్ గా, డైరెక్టర్ గా మూవీస్ చేయాలనుకుంటున్నాను.
ఫ్రెండ్ రిక్వెస్ట్ సక్సెస్ పై మీకున్న కాన్ఫిడెన్స్ ఏమిటి..?
ఇంతకు ముందు చెప్పినట్టుగా నేను ఈ మూవీ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అసలు ఒక సినిమాని నిర్మించి రిలీజ్ చేయడమే ప్రజెంట్ బిగ్ సక్సెస్. దాదాపు 50 సెంటర్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాను. మా సినిమాకి ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుంది అని నా నమ్మకం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
ది డెడ్ ఎండ్ అనే హాలీవుడ్ మూవీ చేసాను. ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్ అవుతుంది. ఎలియన్ కాన్సెప్ట్ తో కథ రెడీ చేస్తున్నాను. త్వరలో ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments