'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' పాటల విడుదల

  • IndiaGlitz, [Sunday,June 26 2016]

మోడరన్‌ సినిమా పతాకంపై ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్‌వర్మ పాకలపాటి సహ నిర్మాతగా యూత్‌ఫుల్‌ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న చిత్రం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లోని రేడియో మిర్చి కార్యాలయంలో జరిగింది. తొలి ఆడియో సీడీని దర్శక నిర్మాతలు ఆదిత్య ఓం, విజయవర్మలు ఆవిష్కరించి రేడియో మిర్చి ప్రోగ్రామ్‌ హెడ్‌ సాయికి అందజేశారు. ఈ కార్యక్రమంలో 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' చిత్రంలో నటించిన నటులు, టెక్నీషియన్లతో పాటు గాయని ఆయుషిషా, గేయ రచయిత తైదల బాపు, మిర్చి స్వాతి, ఆదిత్య మ్యూజిక్‌ సంస్ధ ప్రతినిధులు మాధవ్‌, నిరంజన్‌ చారిలు హాజరయ్యారు.

ఆదిత్య ఓం మాట్లాడుతూ - ''మా చిత్ర ఆడియో ఆదిత్య ద్వారా విడుదల చేయడం చేయడం ఆనందంగా వుంది'' అన్నారు. మంచి పాటలతో తెలుగులో ఎంట్రీ ఇస్తానని గాయని ఆయుషిషా అన్నారు.

గేయ రచయిత తైదల బాపు మాట్లాడుతూ - ''ఆదిత్య ఓం, విజయవర్మల ప్రోత్సాహంతో 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' టైటిల్‌ సాంగ్‌ని జనరంజకంగా రాశాను'' అన్నారు.

More News

తిక్క మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్

సాయిధ‌ర‌మ్ తేజ్, లారిస్సా బొనేసి జంట‌గా న‌టించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని సునీల్ రెడ్డి తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ బ్యాన‌ర్ పై సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మించారు.

చుట్టాల‌బ్బాయి టీజ‌ర్ రిలీజ్

ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టించారు.

మ‌నమంతా టీజ‌ర్ రివ్యూ

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం మ‌నమంతా. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు.

మాటీవీలో ఈరోజు రేపు సినిమా అవార్డ్స్..

చిరు చిందేస్తే..? మెగాస్టార్ రియ‌ల్ గా సూప‌ర్ హిట్ సాంగ్ కి గ్రేసీ మూమెంట్స్ ఇస్తే..? అని ర‌క‌ర‌కాల శీర్షిక‌ల‌తో సోష‌ల్ మీడియా, ప్రింట్ మీడియాలో మారుమోగిపోయిన టాపిక్ సినిమా అవార్డ్స్ వేదిక పైన చిరంజీవి డ్యాన్స్.

భానుశంక‌ర్ అర్ధ‌నారి ట్రైల‌ర్ రిలీజ్

నూత‌న న‌టీన‌టులు అర్జున్ య‌జ‌త్, మౌర్యాని ప్ర‌ధాన తారాగ‌ణంగా భానుశంక‌ర్ చౌద‌రి తెర‌కెక్కించిన చిత్రం అర్ధ‌నారి. ఈ చిత్రాన్ని ప‌త్తికొండ సినిమాస్ బ్యాన‌ర్ పై ర‌వికుమార్.ఎమ్ నిర్మించారు. భ‌ర‌త్ రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన అర్ధనారి చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది.