'ఫ్రెండ్ రిక్వెస్ట్' పాటల విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్‌వర్మ పాకలపాటి సహ నిర్మాతగా యూత్‌ఫుల్ హర్రర్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న చిత్రం 'ఫ్రెండ్ రిక్వెస్ట్'. ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లోని రేడియో మిర్చి కార్యాలయంలో జరిగింది. తొలి ఆడియో సీడీని దర్శక నిర్మాతలు ఆదిత్య ఓం, విజయవర్మలు ఆవిష్కరించి రేడియో మిర్చి ప్రోగ్రామ్ హెడ్ సాయికి అందజేశారు. ఈ కార్యక్రమంలో 'ఫ్రెండ్ రిక్వెస్ట్' చిత్రంలో నటించిన నటులు, టెక్నీషియన్లతో పాటు గాయని ఆయుషిషా, గేయ రచయిత తైదల బాపు, మిర్చి స్వాతి, ఆదిత్య మ్యూజిక్ సంస్ధ ప్రతినిధులు మాధవ్, నిరంజన్ చారిలు హాజరయ్యారు.
ఆదిత్య ఓం మాట్లాడుతూ - ''మా చిత్ర ఆడియో ఆదిత్య ద్వారా విడుదల చేయడం చేయడం ఆనందంగా వుంది'' అన్నారు. మంచి పాటలతో తెలుగులో ఎంట్రీ ఇస్తానని గాయని ఆయుషిషా అన్నారు.
గేయ రచయిత తైదల బాపు మాట్లాడుతూ - ''ఆదిత్య ఓం, విజయవర్మల ప్రోత్సాహంతో 'ఫ్రెండ్ రిక్వెస్ట్' టైటిల్ సాంగ్‌ని జనరంజకంగా రాశాను'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments