నాడు జగన్.. నేడు టీడీపీ నేతల్లో ‘శుక్రవారం’ టెన్షన్

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

కొద్ది రోజుల క్రితం వరకూ ఏపీ సీఎం జగన్‌ను పట్టుకున్న ‘శుక్రవారం’ టెన్షన్ ఇప్పుడు టీడీపీ నేతలను పట్టుకుందా? అసలు యాధృశ్చికమా? లేదంటే కావాలనే చేస్తున్నారా? ఏది ఏమైనా ‘శుక్రవారం’ మాత్రం దడ పుట్టిస్తోంది. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే రకం జగన్ కాదని ఆయనను ఎరిగిన వారెవరైనా చెబుతారు. నాడు కేసులతో ఆయనను పలు రకాలుగా టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. శుక్రవారం వస్తుందంటేనే ఆయనపై సెటైర్లు మామూలుగా పడేవి కావు. అయితే ఇప్పుడా సెటైర్లన్నీ యూ టర్న్ తీసుకుంటున్నట్టుగా పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది.

ఈఎస్‌ఐ కేసులో టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు అరెస్టైంది.. శుక్రవారం రోజే.. తాజాగా గుంటూరులో జరిగిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా శుక్రవారం రోజే అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతుందని.. మరికొందరు టీడీపీ నేతలు పలు కేసుల్లో అరెస్ట్ కాబోతున్నారని సమాచారం. మరి ఆ అరెస్టులు కూడా శుక్రవారం రోజే జరుగుతాయా? లేదో వేచి చూడాలి. నిజానికి ఇవి యాధృచ్చికంగా జరిగి ఉండవచ్చేమో కానీ.. ఇద్దరూ వేర్వేరు తేదీల్లో ఒకే వారం అరెస్ట్ అవడం మాత్రం గమనార్హం.

More News

‘ఆమె కథ’.. మొన్న నవ్యకు.. నేడు రవికృష్ణకూ కరోనా..

ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో బుల్లితెర షూటింగ్‌లు నిర్వహిస్తోంది. కరోనా గైడ్‌లైన్స్ పాటిస్తున్నప్పటికీ పలువురు మాత్రం కరోనా బారిన పడుతూనే ఉన్నారు.

బ్రేకింగ్: కరోనాతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. క్రమక్రమంగా అది అన్ని రంగాలకూ వ్యాపిస్తోంది. సినీ ఇండస్ట్రీకి కూడా కరోనా వ్యాపించింది.

తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. వైద్యులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు.

తెలంగాణలో విశ్వరూపం చూపించిన కరోనా.. నిన్న ఒక్కరోజే...

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. మొన్నటి వరకూ 1200 దాటని కరోనా కేసులు నిన్న దాదాపు 1900 కేసులు నమోదవడంతో తెలంగాణ ప్రజలు షాక్ అయ్యారు.

ఆ అందమైన ప్రేమకథకు హీరోగా రఘు కుంచె...

ఇప్పటికే ‘పలాస 1978’ చిత్రం ద్వారా ఓ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచె హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది.