ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్.. పరీక్షలు యథాతధం

ఏపీలో 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. మే 1 నుంచి 18- 45 వయసు వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ఆయన వెల్లడించారు. కాగా.. ఏపీలో 18-45 మధ్య వయసువారు 2,04,70,364 మంది ఉన్నారని పేర్కొన్నారు. వీరందరికీ 1 వ తేదీ నుంచి ఆయా పరిధిలోని ఆసుపత్రుల్లో ఉచిత వ్యాక్సిన్ అందజేయనున్నట్టు వెల్లడించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గత రాత్రి(శనివారం) నుంచి నైట్‌ కర్ఫ్యూ విధించారు. ఏపీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు.

ఏపీలో ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందించనున్నామని.. అయితే దీని కోసం రూ.1600 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. వైద్య పరీక్షల కోసం ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కట్టడిపై సీఎం జగన్‌ విస్తృతంగా చర్చించారని వెల్లడించారు. వ్యాక్సిన్‌ను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆళ్ల నాని వెల్లడించారు. ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచాలని సీఎం ఆదేశించారని.. అలాగే సిటీ స్కాన్‌కు ధరలు నిర్ణయించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.

అయితే ఈ టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. విద్యాపరంగా విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్‌ తెలిపారు. ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అధికారులకు జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కొవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లకు ఆర్డర్‌ పెట్టాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. రైతు బజార్లు, మార్కెట్లను గతంలోలా వికేంద్రీకరించాలని జగన్‌ పేర్కొన్నారు.

More News

కోవిడ్ రోగిని హైదరాబాద్‌కు విమానంలో తరలించిన సోనూసూద్!

గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో రోడ్డుపైకి వచ్చి నిరంతరం సేవలందించి ప్రముఖ నటుడు సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు.

సంపత్ కుమార్ సమర్పిస్తోన్న ‘లాల్ బాగ్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

రాజమౌళి, ఎన్టీఆర్ ల మూవీ యమదొంగ ఫేమ్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘లాల్ బాగ్’.

హైద్రాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒరిస్సాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన యుద్ధ విమానాలు

తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రభుత్వం ఒక ముందడుగు వేసి.. దేశానికే ఆదర్శంగా నిలిచింది.

చాలా మంది మీరు సేఫా? అని మెసేజ్‌లు పెడుతున్నారు: జస్విక

టిక్‌టాక్ భార్గవ్ కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. భార్గవ్ అందరి ముందు ఒకలా..

ఇలాంటి దారుణమైన జీవో కనివినీ ఎరిగి ఉండరు..

నిజమే.. చదువుతుంటేనే ఇంత దారుణమా? అనిపిస్తుంటుంది. కానీ అలాంటి జీవో ప్రభుత్వమే జారీ చేసిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది.