హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షల కోసం సంప్రదించాల్సిన కేంద్రాలివే..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ పెట్టాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే కరోనా లక్షణాలున్నవారు ఏ ఆసుపత్రిని సంప్రదించాలి? ఎక్కడ ఉచిత పరీక్షలు నిర్వహిస్తారో ముందుగా తెలుసుకుంటే బాధితుడికి సగం కష్టం తీరినట్టే. హైదరాబాద్‌లోని 11 కేంద్రాల్లో ఉచిత కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ రోజుకు పరిమిత సంఖ్యలో మాత్రమే కరోనా టెస్టులు నిర్వహిస్తారు.
ఉచిత కరోనా పరీక్షలు నిర్వహించే కేంద్రాలివే..
ఫీవర్ ఆసుపత్రి(నల్లకుంట)
కింగ్ కోఠి ఆసుపత్రి(కోఠి)
చెస్ట్ ఆసుపత్రి(ఎర్రగడ్డ)
సరోజినీదేవి కంటి ఆసుపత్రి(మెహదీపట్నం)
హోమియోపతి ఆసుపత్రి(రామాంతపూర్)
ఏరియా ఆసుపత్రి(కొండాపూర్)
ఆయుర్వేద ఆసుపత్రి(ఎర్రగడ్డ)
నిజామియా టీబీ ఆసుపత్రి(చార్మినార్)
ఏరియా ఆసుపత్రి(వనస్థలిపురం)
ఈఎస్ఐ ఆసుపత్రి(నాచారం)
నేచర్ క్యూర్ ఆసుపత్రి(అమీర్‌పేట్)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout