PM Narendra Modi:ఫ్రాన్స్‌లో మన యూపీఐ సేవలు .. ఈఫిల్ టవర్ వద్ద ప్రారంభం : శుభవార్త చెప్పిన మోడీ

  • IndiaGlitz, [Friday,July 14 2023]

నోట్ట రద్దు సమయంలో మనదేశంలో అందుబాటులోకి వచ్చిన యునిఫైట్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా డబ్బుతో పని లేకుండా స్మార్ట్‌ఫోన్, చిన్న క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరిగిపోతుండటంతో ప్రజలు కూడా దీనికి బాగా అలవాటు పడ్డారు. పనిలో పనిగా డిజిటల్ పేమెంట్స్ లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. యూపీఐ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 8.27 లక్షల కోట్ల విలువైన 452.75 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. భారత్‌లో రోజుకి ఒక బిలియన్‌ యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని నేషనల్ పేమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నివేదిక తెలిపింది. అంతేకాదు.. డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది. విప్లవాత్మక నిర్ణయాలు, సరికొత్త ఆవిష్కరణలతో భారత్ నగదు రహిత ఆర్ధిక వ్యవస్థ దిశగా అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది.

ప్రవాస భారతీయులతో మోడీ భేటీ :

ఇదిలావుండగా.. అనేక దేశాలు మన యూపీఐ విధానాన్ని అందిపుచ్చుకుని డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లో ఫ్రాన్స్ కూడా చేరనుంది. త్వరలోనే ఇక్కడ యూపీఐ సేవలు ప్రారంభంకానున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ పారిస్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఐ లావాదేవీలు త్వరలో ఫ్రాన్స్‌లోనూ ప్రారంభం కానున్నాయని మోడీ తెలిపారు. త్వరలోనే ఈఫిల్ టవర్ వద్ద ఈ సేవలు ప్రారంభమవుతాయని.. ఈ పర్యాటక ప్రదేశాన్ని చూసేందుకు వచ్చే భారత పర్యాటకులు భారత కరెన్సీని ఇక్కడ చెల్లింపుల నిమిత్తం వాడవచ్చని నరేంద్ర మోడీ తెలిపారు.

యూపీఐను విస్తరించే పనిలో ఎన్‌పీసీఐ :

ఫ్రాన్స్‌లో యూపీఐ అందుబాటులోకి రావడం వల్ల భారతీయులు చాలా మేలు జరుగుతుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అస్తవ్యస్తంగా వున్న ఫారెక్స్ కార్డ్‌లు వినియోగం, నగదును తీసుకెళ్లాల్సిన అవసరాన్ని యూపీఐలు నివారించనున్నాయి. గతేడాది ఎన్‌పీసీఐ, ఫ్రాన్స్‌‌కు చెందిన లైరాలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇప్పటికే మన యూపీఐ విధానాన్ని యూఏఈ, భూటాన్, నేపాల్‌‌, సింగపూర్‌లు విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లోనూ యూపీఐ అమల్లోకి రావడంతో అమెరికా, ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాల్లోనూ ప్రవేశపెట్టాలని ఎన్‌పీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది.

More News

Mayabazaar For Sale:ఈ వెబ్ సిరీస్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.. ‘మాయాబజార్ ఫర్ సేల్’ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నవదీప్

వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప‌లు భాష‌ల్లో అందిస్తూ త‌నదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న డిజిటల్ మాధ్యమం జీ 5 త్వరలోనే

ISRO:ఫెయిల్యూర్ నుంచి గుణపాఠాలు.. నేడే చంద్రయాన్ - 3 , సర్వం సిద్ధం చేసిన ఇస్రో

అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది.

Pawan Kalyan:జగన్ రౌడీ పిల్లాడు .. జగ్గూభాయ్‌‌కి భయపడొద్దు, నేను హ్యాండిల్ చేస్తా : పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వాలంటీర్ వ్యవస్థపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పార్టీ నేతలతో

YS Jagan:ఏ సర్వే అయినా రిజల్ట్ ఒక్కటే .. జగన్‌కే పట్టాభిషేకం,  పోల్ స్ట్రాటజీ సంస్థది అదే మాట..!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.

Botsa Satyanarayana:చూచిరాతలు, స్కాంలు.. ఆఫ్ట్రాల్ పరీక్షలే నిర్వహించలేరు .. తెలంగాణతో ఏపీకి పోలికా : బొత్స సంచలన వ్యాఖ్యలు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ తదితర ఘటనల నేపథ్యంలో తెలంగాణ విద్యావ్యవస్థపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.