`మా`లో గందరగోళం.. వివరాలు మళ్లీ చెబుతామంటూ వెళ్లిపోయినా జీవిత, రాజశేఖర్
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో గొడవలు బట్టబయలైయ్యాయి. గత కొన్నిరోజులుగా ఓకే ప్యాన్‌లో నిలిచి గెలిచి.. `మా` ప్రెసిండెంట్‌గా సీనియర్ నరేశ్, సెక్రటరీగా జీవిత, వైస్ ప్రెసిడెంట్‌గా డా.రాజశేఖర్ సహా ఇతర సభ్యులు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల నుండి నరేశ్, జీవిత-రాజశేఖర్ మధ్య విభేదాలు వచ్చాయి. అయితే అవేం లేవంటూ ఇన్ని రోజులు వారు చెప్పుకుంటూ వచ్చినప్పటికీ తాజాగా `మా`లో జరిగిన పరిణామాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఈరోజు జరగిన జనరల్ మీటింగ్ ముందు నుండి వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
నిజానికి జనరల్ బాడీ మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని జీవిత, రాజశేఖర్‌లు అనుకున్నారు. కానీ నరేశ్ వర్గం కోర్టును ఆశ్రయించడంతో చివరకు జీవిత-రాజశేఖర్ దాన్ని జనరల్ మీటింగ్ అని అన్నారు. దానికి నరేశ్ మినహా దాదాపు ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యారు. చివరకు ఈ వ్యవహారం రసాభాసగా మారింది. చాలా మంది సభ్యులు మీటింగ్ నుండి వాకౌట్ చేశారు.
చివరకు మీటింగ్ అనంతరం జీవిత, రాజశేఖర్‌లు ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. తర్వాత వివరాలను తెలియజేస్తామని తెలిపారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్న గొడవలు, ఇబ్బందులను సినీ పెద్దలు చిరంజీవి, కృష్ణంరాజు, వెంకటేశ్, బాలకృష్ణలు పరిష్కరించాలని కోరారు. అసోసియేషన్‌లో ప్రతి ఒక్కరూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలాగా ఫీల్ అవుతున్నారని, ఏదో మీటింగ్ అని తిరుపతి నుండి ఇక్కడకు వస్తే.. మరి పరిస్థితి దారుణంగా ఉందని పృథ్వీ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com