`మా`లో గంద‌ర‌గోళం.. వివ‌రాలు మ‌ళ్లీ చెబుతామంటూ వెళ్లిపోయినా జీవిత, రాజ‌శేఖ‌ర్‌

  • IndiaGlitz, [Sunday,October 20 2019]

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)లో గొడ‌వ‌లు బ‌ట్ట‌బ‌య‌లైయ్యాయి. గ‌త కొన్నిరోజులుగా ఓకే ప్యాన్‌లో నిలిచి గెలిచి.. 'మా' ప్రెసిండెంట్‌గా సీనియ‌ర్ న‌రేశ్‌, సెక్ర‌ట‌రీగా జీవిత, వైస్ ప్రెసిడెంట్‌గా డా.రాజ‌శేఖ‌ర్ స‌హా ఇత‌ర స‌భ్యులు ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని రోజుల నుండి న‌రేశ్, జీవిత‌-రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. అయితే అవేం లేవంటూ ఇన్ని రోజులు వారు చెప్పుకుంటూ వ‌చ్చిన‌ప్ప‌టికీ తాజాగా 'మా'లో జ‌రిగిన ప‌రిణామాలు ఈ విష‌యాన్ని తేట‌తెల్లం చేశాయి. ఈరోజు జ‌ర‌గిన జ‌నర‌ల్ మీటింగ్ ముందు నుండి వివాదానికి మ‌రింత ఆజ్యం పోసింది.

నిజానికి జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌ను ఏర్పాటు చేయాల‌ని జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌లు అనుకున్నారు. కానీ న‌రేశ్ వ‌ర్గం కోర్టును ఆశ్ర‌యించ‌డంతో చివ‌ర‌కు జీవిత‌-రాజ‌శేఖ‌ర్ దాన్ని జ‌న‌ర‌ల్ మీటింగ్ అని అన్నారు. దానికి న‌రేశ్ మిన‌హా దాదాపు ఎక్కువ మంది స‌భ్యులు హాజ‌ర‌య్యారు. చివ‌ర‌కు ఈ వ్య‌వ‌హారం ర‌సాభాస‌గా మారింది. చాలా మంది స‌భ్యులు మీటింగ్ నుండి వాకౌట్ చేశారు.
చివ‌ర‌కు మీటింగ్ అనంత‌రం జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌లు ఏమీ మాట్లాడ‌కుండానే వెళ్లిపోయారు. త‌ర్వాత వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని తెలిపారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో ఉన్న గొడ‌వ‌లు, ఇబ్బందుల‌ను సినీ పెద్ద‌లు చిరంజీవి, కృష్ణంరాజు, వెంక‌టేశ్‌, బాల‌కృష్ణ‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరారు. అసోసియేష‌న్‌లో ప్ర‌తి ఒక్క‌రూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలాగా ఫీల్ అవుతున్నార‌ని, ఏదో మీటింగ్ అని తిరుప‌తి నుండి ఇక్క‌డ‌కు వ‌స్తే.. మ‌రి ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని పృథ్వీ తెలిపారు.

More News

ఇవాళ ‘మునిగిన బోటు’ బయటికొచ్చే అవకాశం!

తూర్పుగోదారి జిల్లా కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును ఇవాళ సాయంత్రం బయటికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

‘మా’లో తారాస్థాయికి విభేదాలు.. పరుచూరి కంటతడి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం నాడు జరిగిన మా అసిసోయేషన్ మీటింగ్ గందరగోళంగా మారింది.

వెంకీతో బాలీవుడ్ న‌టుడు

విక్ట‌రీ వెంక‌టేశ్‌, త‌రుణ్ భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ  సినిమాను రూపొందించ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌' సక్సెస్ మీట్

బిజిఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి స్టూడియోస్‌ బ్యానర్‌ పై ప్రముఖ కమెడియన్‌ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌'.

కల్కీ ఆశ్రమంలో ముగిసిన ఐటీ రైడ్స్.. షాకింగ్ నిజాలివీ

‘కల్కి’ పేరుతో చిత్తూరు జిల్లాలో వెలిసిన ‘కల్కి భగవాన్‌’ ఆశ్రమంలో గత నాలుగురోజులుగా ఐటీ అధికారులు జరిపిన సోదాలు ముగిశాయి.