వెంక‌టేశ్‌తో నాలుగోసారి

  • IndiaGlitz, [Sunday,May 27 2018]

టాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో వెంకటేశ్‌, న‌య‌న‌తార జోడి ఒక‌రు. ల‌క్ష్మీ, తుల‌సి, బాబు బంగారం చిత్రాల్లో ఈ జంట ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసింది. ఇప్పుడు నాలుగోసారి ఈ జంట వెండితెర‌పై క‌నువిందు చేయ‌నుంద‌ట‌. వివ‌రాల్లోకి వెళితే.. వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య హీరోలుగా ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమాలో వెంక‌టేశ్ జోడిగా న‌య‌న‌తార న‌టించ‌బోతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. జూన్ నుండి సినిమా ప్రారంభం కానుంది. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించ‌బోతుందని టాక్‌.