క‌మ‌ల్‌తో అజిత్‌కిది నాలుగోసారి

  • IndiaGlitz, [Saturday,October 31 2015]

ఈ దీపావ‌ళి త‌మిళ‌నాట ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎందుకంటే.. క‌మ‌ల్ హాస‌న్ తాజా చిత్రం 'తూంగ‌న‌గ‌రం' (తెలుగులో 'చీక‌టి రాజ్యం'), అజిత్ కొత్త సినిమా 'వేదాళం' ఒకే రోజున (న‌వంబ‌ర్ 10) విడుద‌ల కావ‌డ‌మే అందుకు కార‌ణం. అయితే క‌మ‌ల్‌తో అజిత్ బ‌రిలోకి దిగ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో మూడుసార్లు ఒకేరోజున క‌మ‌ల్‌, అజిత్ సినిమాలు విడుద‌ల‌య్యాయి.

1994లో న‌వంబ‌ర్‌2న క‌మ‌ల్ 'న‌మ్మ‌వ‌ర్' రిలీజైతే.. అజిత్ 'ప‌విత్ర' కూడా అదే తేదికి వ‌చ్చింది. 2000లో ఫిబ్ర‌వ‌రి 18న క‌మ‌ల్ 'హేరామ్' రిలీజైతే.. ఆ రోజే అజిత్ 'ముగ‌వ‌రి' కూడా వ‌చ్చింది. 2002లోనేమో జ‌న‌వ‌రి 14న క‌మ‌ల్ న‌టించిన 'ప‌మ్మ‌ల్ కె.సంబంధం' వ‌స్తే.. ఆ రోజునే అజిత్ 'రెడ్' సినిమా వ‌చ్చింది. మ‌ళ్లీ 13 ఏళ్ల త‌రువాత నాలుగోసారి ఒకే రోజున క‌మ‌ల్‌, అజిత్ కోలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతున్నారు. ఈ సారి స్పెష‌ల్ ఏమిటంటే.. క‌మ‌ల్ కూతురు శ్రుతి హాస‌న్‌తో క‌లిసి అజిత్ విశ్వ‌న‌టుడుతో పోటీప‌డ‌డం.

More News

మ‌హేష్, మురుగుదాస్ మూవీ ముహుర్తం

సూప‌ర్ స్టార్ మ‌హేష్, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే.

న‌వ‌ర‌సాలు ఉన్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త్రిపుర : నిర్మాత చిన‌బాబు

క‌ల‌ర్స్ స్వాతి టైటిల్ రోల్ పోషించిన చిత్రం త్రిపుర‌. ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర‌, స్వాతి జంట‌గా న‌టించారు. గీతాంజ‌లి ఫేం రాజ్ కిర‌ణ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

'త్రిపుర' కథ ఇదే..

కలర్స్ స్వాతి టైటిల్ రోల్ పోషించిన చిత్రం త్రిపుర.ఈ చిత్రంలో నవీన్ చంద్ర,స్వాతి జంటగా నటించారు.గీతాంజలి ఫేం రాజ్ కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

'కంచె' కాంబినేషన్లో మరో సినిమా

వరుణ్ తేజ్,క్రిష్ కాంబినేషన్లో రూపొందిన కంచె విమర్శకుల ప్రశంసలందుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే.

నాగశౌర్య పాటలకు ముహుర్తం కుదిరింది...

రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా `అబ్బాయితో అమ్మాయి`.కిరణ్ స్టూడియోస్,జె.బి.సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.