ముగిసిన నాలుగో విడత పోలింగ్.. పొటెత్తిన ఓటర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా సోమవారం జరిగిన నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 373 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా మే-06న ఐదో విడతలో 51 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
టీఎంసీ, బీజేపీ, వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు వారిని చెదరగొట్టాయి. కేంద్ర మంత్రి, అసన్సోల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బబుల్ సుప్రియో కారుపై కొంతమంది టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేయగా కారు ధ్వంసమైంది.
ఇదిలా ఉంటే.. ముంబైలో ఓటేసేందుకు బాలీవుడ్ స్టార్స్ పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఈ విడతలో పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీఎంలు, మాజీ సీఎంలు ఓటు వేశారు. ఉత్తర ముంబై నియోజకవర్గంలోని కాందీవలిలో ఓటు వేయడానికి ఓటర్లు కిలోమీటర్ల మేర బారులు తీరారు. తమ వంతు వచ్చే వరకు ఓపికగా వేచి ఉండి ఓటు వేస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఓటింగ్ శాతం ఇలా ఉంది...
బీహార్-44.33
ఝార్ఖండ్-57.13
ఉత్తరప్రదేశ్-53.23
ఒడిశా-53.61
మహారాష్ట్ర-42.52
మధ్యప్రదేశ్-57.77
రాజస్థాన్-54.75
పశ్చిమ బెంగాల్-66.46
జమ్మూకాశ్మీర్-9.37
కాగా.. ఇవాళ మహారాష్ట్ర (17), ఉత్తరప్రదేశ్ (13), రాజస్థాన్ (13), పశ్చిమ బెంగాల్ (8), మధ్యప్రదేశ్ (6), ఒడిశా (6), బీహార్ (5), ఝార్ఖండ్ (3), జమ్మూకాశ్మీర్ (1) రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 961 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువరు ప్రముఖ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఎస్ఎస్ ఆహ్లూవాలియా, బాబుల్ సుప్రియో, కాంగ్రెస్ తరఫున ఊర్మిళ, సల్మాన్ ఖుర్షీద్, మిలింద్ దేవ్‌రా, అధీర్ రంజన్ చౌదరి, ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, సీపీఐ నుంచి కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout