తక్కువ గ్యాప్లో నాలుగు సూపర్ హిట్ సాంగ్స్
Send us your feedback to audioarticles@vaarta.com
భాస్కరభట్ల రవికుమార్.. తెలుగు పరిశ్రమలో ఎన్నో మాస్, రొమాంటిక్, మెలోడీ పాటలకు సాహిత్యాన్ని అందించిన గీత రచయిత. కాకపోతే మాస్ పాటలే ఆయన బలం. ఈ సంక్రాంతికి విడుదల కానున్న రెండు పెద్ద సినిమాల్లో మూడు పాటలు.. ఈ రచయిత కలం నుంచి జాలువారినవే. ఈ నెల 10న రిలీజ్ కానున్న 'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్ పాడిన 'కొడకా కోటేశ్వర్రావూ' పాటైతే.. ఖండ ఖండాలు దాటి పోలాండ్ బుడతడు పాడేవరకు వెళ్ళింది.
ఇక 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న బాలకృష్ణ 102వ చిత్రం 'జై సింహా'లో.. జస్ప్రీత్ జాజ్, గీతామాధురి ఆలపించిన 'అమ్మకుట్టి అమ్మకుట్టి' మాస్ పాట కాగా.. ఇక ఇదే చిత్రంలో శ్రేయా ఘోషల్, రేవంత్ పాడిన 'ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది' మెలోడీ పాట సాహిత్యం అలరించేలా ఉంది. వీటితో పాటు నాగశౌర్య, రష్మిక మందన్న నాయకానాయికలుగా నటించిన 'ఛలో' మూవీలో 'చూసీ చూడంగానే' అనే మరో మెలోడీ పాటకి అలరించేలా సాహిత్యాన్ని అందించారు భాస్కరభట్ల.
ఫిబ్రవరి 2న ఈ సినిమా విడుదల కానుంది. మొత్తానికి.. తక్కువ గ్యాప్లో విడుదలైన.. ఈ మూడు చిత్రాలకి సంబంధించిన నాలుగు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout