Corona:తెలంగాణలో కొత్తగా నాలుగు కరోనా కేసులు.. ప్రభుత్వం అప్రమత్తం..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో మరోసారి కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కొత్తగా నాలుగు కేసులు నమోదదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. దాదాపు 6 నెలల తర్వాత ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసి ప్రజలను అలర్ట్ చేసింది. మొత్తం 402 మందికి పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చిందని.. మొత్తం 9 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.
కరోనా కేసుల(Corona cases) నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రి, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, నిలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ఐసొలేషన్ వార్డులను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని కోరింది. మాస్కు ధరించకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఫ్లూ లక్షణాలైన జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కుకారడం, శ్వాసలో ఇబ్బందులు వంటివి కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగు చూడటంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరస్సింహా(Damodar Raja Narasimha)అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, మాస్కులు ధరించాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, శ్వాసకోస సంబంధిత సమస్య ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. కోవిడ్19(Covid 19) వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments