తక్కువ గ్యాప్ లో నాలుగు చిత్రాలతో..
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్ళిచూపులు చిత్రంతో సోలో హీరోగా తొలి హిట్‌ను అందుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సంచలన విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. ఈ ఏడాది ప్రథమార్థంలో తక్కువ గ్యాప్‌లోనే నాలుగు చిత్రాలతో సందడి చేయనున్నారు. ఆ చిత్రాలే.. ఏ మంత్రం వేశావే, మహానటి, టాక్సీవాలా, గీతా గోవిందం. వీటిలో ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఏ మంత్రం వేశావే.. మార్చి 9న విడుదల కానుంది. ఇక నటీమణి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి చిత్రం.. మార్చి 29న విడుదల కానుందని ఆ మధ్య నిర్మాతలు ప్రకటించారు.
ఒకవేళ ఆలస్యం అయితే.. ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కావచ్చు. ఇందులో విజయ్ దేవరకొండ ఓ జర్నలిస్ట్ పాత్రలో సందడి చేయనున్నారు. అలాగే టాక్సీ డ్రైవర్‌గా విజయ్ కనిపించనున్న టాక్సీవాలా సినిమా మే 18న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. వీటితో పాటు అల్లు అరవింద్ నిర్మాణంలో పరుశురామ్ తెరకెక్కిస్తున్న గీతా గోవిందం కూడా ఈ ఏడాది ప్రథమార్థంలో సందడి చేయనుంది. మొత్తానికి.. విజయ్ ఈ ఏడాది తన సినిమాలతో బాగానే హవా చూపబోతున్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments