ఎన్టీఆర్ మూవీలో నలుగురు హీరోయిన్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్, నివేథా థామస్ నటించనున్నారని తెలిసింది.
అయితే...ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...ముగ్గురు హీరోయిన్స్ తో పాటు నాలుగవ హీరోయిన్ కూడా ఉందట. జనతా గ్యారేజ్ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఐటం సాంగ్ చేసినట్టుగా ఓ ఐటం సాంగ్ ను స్టార్ హీరోయిన్ తో చేయించాలి అని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.అయితే..ఈ ఐటం సాంగ్ ను ఎవరితో చేయించనున్నారనేది తెలియాల్సి ఉంది. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి తర్వాత ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com