'తలైవి' కోసం నాలుగు గెటప్స్‌లో కంగనా!
- IndiaGlitz, [Saturday,September 14 2019]
ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను ముగ్గురు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఇది కాకుండా ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. వీటిలో ఎ.ఎల్.విజయ్ రూపొందిస్తోన్న బయోపిక్ 'తలైవి'. విష్ణు ఇందూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో టైటిల్ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. కంగనా పాత్ర కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా తమిళం కూడా నేర్చుకుంటున్నారు. అలాగే భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నారనే వార్తలను విన్నాం. అలాగే పాత్ర కోసం 10 కిలోల బరువు కూడా పెరుగుతున్నారని టాక్.
త్వరలోనే సెట్స్‌కు వెళ్లబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకప్ మేన్ జాసన్ కొలిన్స్ వర్క్ చేయబోతున్నారట. ఇది వరకు జాసన్ బ్లేడ్ రన్నర్, హంగర్స్ గేమ్, కెప్టెన్ మార్వల్ చిత్రాలకు పని చేశారు. అలాగే ఈ సినిమాలో జయలలిత జీవితాన్ని నాలుగు దశల్లో చూపించనున్నారట. అందుకోసం కంగనా నాలుగు షేడ్స్‌లో కనిపించనున్నారు.
ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'బాహుబలి' ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదలవుతుంది. ఈ సి నిమాతో పాటుమరో జయలలిత బయోపిక్ 'ది ఐరన్ లేడీ' పేరుతో రూపొందుతోంది. ఇందులో నిత్యామీనన్ జయలలితగా కనిపించనున్నారు. జయలలిత వెబ్‌సిరీస్‌లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరి పురట్చితలైవిగా ఎవరు ఆదరణ పొందుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.