ద‌స‌రా టార్గెట్‌గా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌?

  • IndiaGlitz, [Monday,June 04 2018]

సమ్మర్ సీజన్ ముగిసింది. ఈ నేప‌థ్యంలో.. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఆస‌క్తిక‌ర‌మైన‌ సినిమాలు కొన్ని విజయ దశమిని టార్గెట్ చేస్తూ చిత్రీకరణను కొనసాగిస్తున్నాయి. అయితే వీటిలో నాలుగు సినిమాలు మాత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ప‌క్కాగా రానున్నాయని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని దసరాకి విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు.. 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత జంటగా నటిస్తున్న రవితేజ, ఇలియానా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో విజయ దశమి బరిలో దిగ‌నున్నారు. చాలా కాలంగా విజయానికి దూరంగా ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాతో మళ్ళీ స‌క్సెస్ ట్రాక్ పట్టాలని భావిస్తున్నారు. వీటితో పాటు శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘పడి పడి లేచె మనసు’, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో.. రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలు కూడా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి.. దసరా విజయం ఎవ‌రిని వరిస్తుందో చూడాలి.

More News

పవన్ కళ్యాణ్, రవితేజ బాటలో రాజ్ తరుణ్?

‘ఉయ్యాలా జంపాలా’, ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్.

పి.సి.శ్రీ‌రామ్ ట్రాక్ రికార్డ్ ప్ల‌స్ అవుతుందా?

ద‌క్షిణాదిలోనే కాకుండా హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన కెమెరా పనితనంతో గొప్ప చిత్రాలుగా మలచిన ఘ‌న‌త‌ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సొంతం.

సంక్రాంతి సంద‌డి వీరిదేనా?

2019 సంక్రాంతి ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుందా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల‌లో. వినిపిస్తున్న క‌థ‌నాల ప్రకారం..

భారీ బడ్జెట్‌తో కార్తి 'దేవ్'

గత ఏడాది విడుదలైన ‘ఖాకి’ (తమిళంలో ‘దీరన్ అధిగారం ఒండ్రు’) సినిమా మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మూడోసారైనా లేడీ డైరెక్టర్ కలిసొస్తారా?

వరుసగా మహిళా దర్శకులతో సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న‌ కథానాయిక అమైరా దస్తూర్.