BRS Party: నాలుగు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిపెడుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేలా వ్యూహాలు రచిస్తు్న్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుతో పార్టీలో నూతనోత్సహం నింపాలని కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమాలోచనలు జరపగా.. సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో భేటీ అయ్యారు.
అభ్యర్థుల ఎంపికపై నేతలతో అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశాలకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో పాటు కీలక నాయకులు హాజరయ్యారు. నేతలతో చర్చించిన అనంతరం నలుగురు అభ్యర్థులను అధికారికంగా ఖరారుచేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.
కరీంనగర్ నుంచి వినోద్‌కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పేర్లను ఖరారు చేశారు. గత రెండు రోజులుగా తెలంగాణ భవన్‌లో ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించారు. చర్చల అనంతరం సమష్టి నిర్ణయం ప్రకారం నలుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నేత వినోద్ కుమార్‌ను బరిలో దింపారు. ఇక పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో బాల్క సుమన్‌తో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరును పరిశీలించారు. చివరకు కొప్పుల వైపే మొగ్గు చూపారు. అటు ఖమ్మం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకే మరోసారి అవకాశం కల్పించారు. అలాగే మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితక కూడా మరోసారి ఛాన్స్ ఇచ్చారు. కేసీఆర్ నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకాకపోవడం గమనార్హం.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని వెంకట్రావు రెండు సార్లు కలిశారు. ఓసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మరోసారి కుటుంబంతో సహా కలిశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఉన్న హోటల్‌లో రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండించారు. తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని స్పష్టంచేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెల్లం వెంకట్రావు ఆయనతో పాటే కాంగ్రెస్‌లో చేరారు. కానీ టిక్కెట్ రాదని తెలియడంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇల్లందు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా.. ఒక్క స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉండటంతో జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com