కృష్ణా జిల్లాలో విషాదం.. ప్రాణం తీసిన ఈత సరదా, మున్నేరులో మునిగి ఐదుగురు బాలురు మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మున్నేరులో ఐదుగురు విద్యార్థులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. చందర్లపాడు మండలం ఏటూరు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులను మాగులూరి సన్నీ (12), కర్ల బాలయేసు (12), జెట్టి అజయ్ (12), మైలా రాకేష్ (11), గురజాల చరణ్ (14)గా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటివద్దే ఉంటున్న ఈ ఐదుగురు విద్యార్ధులు సోమవారం మున్నేరులో స్నానానికి వెళ్లారు. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చే సరికి పిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఎంత గాలించినా పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు మున్నేరువైపు వెళ్లారని పశువుల కాపరి చెప్పడంతో అంతా అక్కడికి పరుగులు తీశారు. అక్కడకు వెళ్లి చూసే సరికి బట్టలు, సైకిళ్లు కనిపించాయి. అయితే పిల్లల ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది సోమవారం సాయంత్రం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.
సంక్రాంతికి పండుగకు గ్రామమంతా సిద్ధమవుతున్న వేళ.. ఈ ఐదుగురు చిన్నారుల మరణం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలు లేరన్న వార్త తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com