జమ్మూలో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన.. జగన్ నిర్ణయంతో హిందూ ధర్మ ప్రచారం
Send us your feedback to audioarticles@vaarta.com
టిటిడి చరిత్రలో ఇది కొత్త మైలు రాయి అని చెప్పొచ్చు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఆదివారం జమ్ముకు అతి సమీపంలో ఉన్న మజీన్ అనే గ్రామంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
ఈ మహత్తర కార్యక్రమానికి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి, డాక్టర్ జితేంద్ర సింగ్, ఎంపి శ్రీ జగల్ కిషోర్ శర్మ, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, శ్రీ రామ్ మాధవ్, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ గోవింద హరి, స్థానిక అధికారులు హాజరయ్యారు.
వేద పండితులు, అర్చకుల ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. శ్రీవారి ఆలయం కోసం టిటిడికి జమ్ము ప్రభుత్వం 62 ఎకరాల భూమిని కేటాయించింది. భూమి పూజ అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర మంత్రులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం నమూనాలను చూసి వివరాలు తెలుసుకున్నారు. శంకుస్థాపన అనంతరం టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
జమ్మూలో స్వామివారి ఆలయ నిర్మాణానికి ఏడాది నుంచి ప్రయత్నం చేస్తున్నాం అని, కోవిడ్ కారణంగా శంకుస్థాపన ఆలస్యం అయ్యిందని సుబ్బారెడ్డి తెలిపారు. దాదాపు రూ 33 కోట్ల నిధులు శ్రీవారి ఆలయం కోసం టిటిడి మంజూరు చేసినట్లు సుబ్బారెడ్డి అన్నారు. ఆలయ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుంది. తొలి దశలో 27 కోట్లతో ప్రధాన ఆలయం, ఉప ఆలయాలు, విద్యుత్ సరఫరా, నీటి సదుపాయం, భక్తుల వసతి గృహాలు పూర్తి చేస్తామని సుబ్బారెడ్డి అన్నారు.
మిగిలిన నిధులతో రెండవ దశలో వేదపాఠశాల, హాస్టల్ నిర్మాణం ఉంటుందని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశంతో హిందూధర్మ ప్రచారం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout