ప్రియాంకరెడ్డి హత్యకేసులో కీలక ఆధారాలు దొరికాయ్: సజ్జనార్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ప్రియాంరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేవలం 24 గంటల్లోనే నిందితులెవరో తెలుసుకుని ఈ కేసు ఛేదించారు. ఈ మేరకు తాము కీలక ఆధారాలు సేకరించినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. శుక్రవారం నాడు మీడియా ముందుకొచ్చిన సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ‘ప్రియాంక హత్యకేసులో కీలక ఆధారాలు లభించాయి. సాధ్యమైనంత త్వరలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెడతాం. ప్రియాంకను ప్రాణాలతో కాపాడలేకపోయినందుకు బాధపడుతున్నాం. ప్రియాంక డయల్ 100కు ఫోన్ చేసి ఉంటే బాగుండేది. హత్య కేసుపై మీడియాలో వస్తోన్న నిందితుల పేర్లు సరికావు. త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తాం. ఈ కేసు గురించిన వివరాలు తెలిపేందుకు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాంసినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఆలస్యంగా అందింది’ అని సజ్జనార్ మీడియాకు వెల్లడించారు.
నిందితుడు తల్లి మాటల్లోనే!
ఇదిలా ఉంటే.. ఇప్పటికే నిందితులు ఎవరో దొరికారని మీడియాలో పెద్ద ఎత్తున ఫొటోలు వేసి మరీ పుంకాలు పుంకాలుగా కథనాలు అల్లేస్తున్నారు. మరి ఈ వార్తలపై సజ్జనార్ ఎలా రియాక్ట్ అవుతారో మరి. కాగా.. మహ్మాద్ పాషా ప్రధాని అనుమానితుడని.. ప్రధాన నిందితుడని మీడియా వార్తలు వస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న పాషా తల్లి మీడియాతో మాట్లాడుతూ.. పాషాను జిక్లేరులోని తమ ఇంటి నుంచే మహ్మద్ పాషాను పోలీసులు తీసుకెళ్లారని చెప్పింది. అయితే, ఎందుకు తీసుకెళ్లారో తనకు తెలియదని.. ఐదేళ్ల నుంచి తన కుమారుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెప్పుకొచ్చింది. అతడు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికొచ్చాడని.. ఆ తర్వాత 3 గంటలకు పోలీసులు వచ్చి తీసుకెళ్లారని తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments