క్షీణిస్తోన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం..

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఢిల్లీలోని కంటోన్మెంట్ ఆర్మీ ఆసుపత్రి బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం ఊపరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు చికిత్సనందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఇప్పటికీ కోమాలో కొనసాగుతున్నారని, వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మంగళవారం ఆయన రెనల్ పెరామీటర్స్ కొద్దిగా క్రమం తప్పినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్ట్ 10న ప్రణబ్ చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన ట్విట్టర్ వేదికగా తనతో టచ్‌లో ఉన్నవారంతా పరీక్ష చేయించుకోవాలని కోరారు. అనంతరం ఆయనకు బ్రెయిన్‌కు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ప్రణబ్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

More News

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. తిరిగి షూటింగ్‌కి వచ్చేశా: ప్రకాష్ రాజ్

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చాలా కాలం తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నారు. ఐదు నెలల కాలంగా సినీ పరిశ్రమ స్తంభించి పోయింది.

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో మరోసారి షాక్..

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాక్ తగిలింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇచ్చిన  స్టేటస్ కోను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవ‌లేద‌న్న‌ మాట రాకూడ‌దు: ‘వి’ ట్రైలర్

నేచుర‌ల్ స్టార్ నాని 25వ చిత్రంగా తెరకెక్కిన ‘వి’ ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై విడుదల కానున్న విషయం తెలిసిందే.

మోసగాడి వలకు చిక్కిన ఎంపీ కేకే.. లాస్ట్‌లో కథ అడ్డం తిరిగింది..

ఎంపీ కేకే చాలా సులభంగా మోసగాడి వలకు చిక్కేశారు. అయితే లాస్ట్‌లో కథ అడ్డం తిరిగింది. మహేష్ అనే మోసగాడు ఎంపీ కేకేకు ఫోన్ చేసి..

సెప్టెంబర్ 14 నుంచి ప్రత్యేక ఏర్పాట్ల నడుమ పార్లమెంట్ సమావేశాలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.