Pervez Musharraf : పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత.. ఆ కోరిక తీరకుండానే
Send us your feedback to audioarticles@vaarta.com
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లుగా దుబాయ్ వార్తాసంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.
ఇది ముషారఫ్ ప్రస్థానం:
1943 ఆగస్ట్ 11న ఢిల్లీలో జన్మించిన ముషారప్.. అఖండ భారత్ విభజన తర్వాత ఆయన కుటుంబం పాకిస్తాన్‌కు వలస వెళ్లింది. కరాచీ, లాహోర్‌లలో ముషారఫ్ విద్యాభ్యాసం గడిచింది. ఆ తర్వాత సైన్యంలో చేరిన అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. 1999లో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనికాధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్నారు. 2001 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధానికి ప్రధాన సూత్రధారి ముషారఫే. ఆయనను తర్వాతి రోజుల్లో అభిశంసనతో పాటు పలు కేసులు చుట్టుముట్టడంతో వీటి నుంచి తప్పించుకునేందుకు ముషారఫ్ తన పదవికి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2016 నుంచి దుబాయ్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.
అమిలాయిడోసిస్ వ్యాధి బారినపడ్డ ముషారఫ్:
అయితే అత్యంత అరుదైన అమిలాయిడోసిస్ అనే వ్యాధి బారినపడిన ముషారఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతేడాది ఆరోగ్యం విషమించడంతో ముషారఫ్ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఆయన కుటుంబం, పాకిస్తాన్ మీడియా ఖండించింది.తాజాగా మాత్రం పాక్‌కు చెందిన జియో న్యూస్ ముషారఫ్ మరణించినట్లుగా కథనాన్ని ప్రసారం చేసింది. చివరి రోజుల్లో తాను పాకిస్తాన్‌లో గడపాలని అనుకుంటున్నట్లు ముషారఫ్ పలుమార్లు ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఆయన కోరిక తీరకుండానే కన్నుమూశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments