ముషారఫ్‌ను నిజంగానే ఉరి తీస్తారా!?

  • IndiaGlitz, [Tuesday,December 17 2019]

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు ఆ దేశంలోని ప్రత్యేక కోర్టు ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దేశద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన కోర్టు మరణదండనే తగిన శిక్ష అని తేల్చేసింది. మంగళవారం నాడు ఆయన కేసులపై విచారణ జరిపిన పెషావర్ కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దోషిగా తేల్చింది. ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ముషారఫ్ మరణ శిక్షను సమర్థించగా.. మరొక న్యాయమూర్తి వ్యతిరేకించారు. మెజార్టీ న్యాయమూర్తుల నిర్ణయంతో మరణ శిక్ష ఖరారైంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో ముషారఫ్ అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. మొత్తానికి చూస్తే నాడు అధ్యక్షునిగా ఉంటూ ఏ న్యాయమూర్తులనైతే ఇబ్బంది పెట్టారో.. ఇప్పుడే అదే న్యాయమూర్తులు ఈయనకు ఉరిశిక్ష విధించడం గమనార్హం.

నిజంగానే ఉరిశిక్ష ఉంటుందా..!?
వాస్తవానికి ఆయన ఎప్పుడో పాక్‌ను వదిలేసి దుబాయ్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలా కాలంగా ఆయన దుబాయ్‌లో నివసిస్తుండటంతో అక్కడి పౌరసత్వం కూడా లభించినట్టు ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే పక్కాగా సమాచారం మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్ష పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కోర్టు తీర్పునిచ్చింది సరే.. ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుందనేది ఇప్పుడు పాక్‌లో మేథావులు, విశ్లేషకులకు, సామాన్య పౌరులకు వస్తున్న అనుమానాలు వస్తున్నాయి. 2013 నమోదైన దేశ ద్రోహం కేసును నాన్చి.. నాన్చి ఇక్కడికి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు తీర్పు వచ్చేసింది.. అమలు ఇక కనీసం నాలుగైదేళ్లయినా పడుతుందేమో మరి.!. వాస్తవానికి పాక్ ప్రభుత్వం మాట మీద నిలబడిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే పాక్-భారత్ బార్డర్స్‌లో నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే ఇందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

అసలేంటి ఈ కేసు!?
అధ్యక్షునిగా తన స్థానాన్ని క్రమపరచుకునే ప్రయత్నంలో పర్వేజ్ ముషార్రఫ్ 2007 నవంబరు 28న సైన్యంలో తన పదవికి రాజీనామా చేసి వచ్చేశారు. అనంతరం 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో రాజ్యాంగానికి వ్యతిరేంగా ఎమర్జెన్సీని విధించారు. ఏకంగా దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్బంధం విధించి.. చాలామంది న్యాయమూర్తులను విధుల నుంచి తప్పించారు. అక్కడితో ఆగని ముషారఫ్.. మీడియాపై ఆంక్షలు విధించడంతో.. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత 2013లో ముషారఫ్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది. 2016లో వైద్యం పేరుతో ముషారఫ్ దుబాయ్ వెళ్లిపోయి అక్కడే తలదాచుకుంటున్నాడు. తర్వాత కోర్టు సమన్లు పంపించినా స్పందించలేదు.. కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయన్ను అరెస్ట్ చేయాలని ఎఫ్‌ఐను ఆదేశించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన స్పెషల్ కోర్టు నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. నేడు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

ముషారఫ్ ఏమంటున్నారు!?
ఇటీవలే ముషారఫ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘నాపై ఉన్న అభియోగాలన్నీ నిరాధారమైనవి. నా లాయర్ వాదనను కూడా కోర్టు వినడం లేదు. పాకిస్థాన్ కోసం నేను యుద్ధాలు చేశాను. దేశాధ్యక్షుడిగా దేశానికి సేవలందించాను’ అని చెప్పుకొచ్చారు. కాగా.. 2008లో రాజకీయాలను వదలివేసిన తర్వాత యూకేలోని లండన్‌లో స్వీయ-బహిష్కరణలో ఉన్నారు. ఒకానొక సందర్భం అనగా 2010 ఓ చర్చలో మాట్లాడుతూ.. 2013లో పాకిస్తాన్ లో రాబోతున్న ఎన్నికల్లో పాల్గొనడానికి తాను అక్టోబరులో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అయితే నాటి నుంచి నేటి వరకూ ఆయన అడ్రస్సే లేదు మరి.

ఆయన ఎక్కడున్నాడు!?
ముషారఫ్ ప్రస్తుతం దుబాయ్‌లో కొన్ని రోజులు.. లండన్‌లో కొన్నిరోజులు తలదాచుకుంటున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ మీడియా చెబుతున్న ప్రకారం గుండె సంబంధిత కారణాలతో పాటు అధిక రక్తపోటుతో ఆయన బాధపడుతున్నారు. మరి ఇంతలా బాధపడుతున్న ఆయన ఎప్పుడు పాక్‌కు వస్తారో..? ఎప్పుడు ఉరి శిక్ష విధిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

More News

ఆస్కార్ అవార్డ్ నుండి 'గ‌ల్లీ బాయ్' ఔట్‌

బాలీవుడ్ సినిమా `గ‌ల్లీబాయ్‌`కు నిరాశ ఎదురైంది. ఈ ఏడాది విదేశీ చిత్రాల కేట‌గిరీలో ఇండియా నుండి ఎంపికైన చిత్రాల్లో `గ‌ల్లీబాయ్` ఒక‌టి.

ఈసారి రెండు చోట్ల ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `అల‌...వైకుంఠ‌పుర‌ములో...`.  `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`

అజిత్ కి విలన్ గా టాలీవుడ్ క్రేజీ హీరో

తొలి చిత్రం `ఆర్‌.ఎక్స్ 100`తో హీరోగా త‌నేంటో ప్రూవ్ చేసుకున్న కార్తికేయ హీరోగా చేసిన `హిప్పి`, `గుణ 369`,

దాన్ని టాటూగా వేయించుకున్న నాగ‌శౌర్య

సాధార‌ణంగా టాటూలుగా మ‌న‌కు న‌చ్చిన వ్య‌క్తుల పేర్లు వేసుకుంటాం. కొంద‌రు కొన్ని బొమ్మ‌ల‌ను టాటూలుగా వేయించుకుంటారు.

తనీష్ 'మహాప్రస్థానం'షూటింగ్ ప్రారంభం..

తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. జర్నీఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక.