Balka Suman:పరారీలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.. పోలీసులు గాలింపు..

  • IndiaGlitz, [Friday,February 09 2024]

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పరారీలో ఉన్నారు. అయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సుమన్‌పై మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌తో పలు పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అప్పటి నుంచి సుమన్.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం ఇంట్లో కూడా లేకపోవటంతో రెండు రోజుల నుంచి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

కాగా ఇటీవల మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అసభ్యపదజాలంతో వ్యాఖ్యలు చేయడంపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను లంగా అని మాట్లాడుతున్నాడు.. ఈ రండగాడు.. హోలేగాడు అంటూ ఊగిపోయారు. ఈ చెత్త నా కొ..కుని చెప్పుతో కొట్టినా తప్పు లేదంటూ చెప్పు తీసి చూపించారు. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం అని ఫైర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి చెప్పు చూపిస్తావా అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టారు. ఎంతో మంది ఉద్యమకారులను మభ్యపెట్టి సుమన్‌ పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్‌లలో సుమన్ వ్యాఖ్యలపై ఫిర్యాదులు చేశారు. దీంతో సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం కాగా ఆయన పరారీలో ఉన్నారు.

More News

OTT:ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు ఇవే..

ఈ వారం సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ దొరకనుంది. అటు థియేటర్లలో అరడజను సినిమాలు రిలీజ్ కాగా..

PV Narasimha Rao:తెలుగుతేజం పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది.

Congress vs BRS:కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్,

గ్రేటర్‌లో బీఆర్ఎస్‌ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ డిప్యూటీ మేయర్..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, స్టేషన్‌ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిలకు భద్రత పెంచిన పోలీసులు

ఎట్టకేలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు పోలీసులు భద్రతను పెంచారు. ఈ విషయాన్ని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ నుంచి