Mahender Reddy :కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు

  • IndiaGlitz, [Friday,February 09 2024]

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వికారాబాద్ జెడ్పీ ఛైర్మన్‌గా ఉన్న సునీతారెడ్డి చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతోనే రేవంత్‌ రెడ్డిని కలసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ నుంచి తాండూర్ ఎమ్మెల్యేగా పైలట్ రోహిత్‌రెడ్డి గెలిచారు. అయితే ఎన్నికల అనంతరం ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి కేసీఆర్.. టికెట్ ఇవ్వడంతో మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే కేసీఆర్ కలుగజేసుకుని మంత్రి పదవి ఇవ్వడంతో పార్టీలోనే ఉండిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు వికారాబాద్‌ జిల్లాలోని 4 నియోజకవర్గాలు హస్తం పార్టీ గెలుచుకుంది. దీంతో పట్నం దంపతులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న, సీనియర్‌ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్‌ తదితరులు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.

సీనియర్ నేత అయిన పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనుండటం వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే ఆయన సోదరడు నరేందర్ రెడ్డి మాత్రం గులాబీ పార్టీలోనే ఉండనున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సామెత ఉంది. ఒకప్పుడు బద్ధ శత్రువుగా ఉన్న నేతలు కూడా అవసరాల దృష్ట్యా మిత్రులుగా మారిపోతారు. ఈ సామెత ప్రస్తుతం చక్కగా సరిపోతుంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా పట్నం మహేందర్‌రెడ్డి పనిచేశారు. తన సోదరుడు నరేందర్‌రెడ్డిని రేవంత్‌పై పోటీకి దింపి తొలిసారి ఆయన నియోజకవర్గంలోనే ఓడించారు. ఆ తర్వాత రేవంత్ మల్కాజ్‌గిరి ఎంపీగా గెలవడం, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడం తెలిసిందే.

More News

ఏపీలో ఆ పార్టీదే విజయం.. జాతీయ మీడియా సర్వే ఏం చెప్పిందంటే..?

దేశంలో త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు.

Lokesh :ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల 'శంఖారావం'కి లోకేష్ సిద్ధం

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మరోసారి ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల యువగళం పాదయాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే.

Yatra 2:తెలుగు రాష్ట్రాల్లో 'యాత్ర-2' ప్రభంజనం.. దద్దరిల్లుతోన్న థియేటర్లు..

ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన 'యాత్ర-2' మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

Kodikatthi Srinu :ఎట్టకేలకు కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు

2019 ఎన్నికలకు ముందు ఏపీలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది.

Governor:తమది ప్రజా ప్రభుత్వం.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.