మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో తన ప్రమేయమేమీ లేదని.. ఈ ఆరోపణల్లో నిజం లేదని అఖిల ప్రియ వెల్లడించారు. తన భర్త కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదని.. అసలు ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. అలాగే తమ కుటుంబ సభ్యులను సైతం పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. తనకు కొంత సమయం ఇస్తే అన్ని విషయాలు అన్ని విషయాలనూ మీడియాకు వెల్లడిస్తానని తెలిపారు. దయచేసి తప్పుడు వార్తలను ప్రసారం చేయవద్దని మీడియాను అఖిలప్రియ కోరారు.
కాగా.. నగరంలోని బోయినపల్లి మనోవికాస్ నగర్లో సినీ ఫక్కీలో కేసీఆర్ సోదరి తరుఫు సమీప బంధువులైన ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్‌రావులను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఐటీ అధికారుల పేరుతో హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ ఇంట్లోకి ప్రవేశించిన కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడటమే కాకుండా ప్రవీణ్‌తో పాటు అతని సోదరులను కూడా కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. కిడ్నాప్‌నకు గురైన ముగ్గురినీ వికారాబాద్‌లో గుర్తించారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్‌రామ్, మరిది చంద్రహాస్‌లను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కాగా.. గత కొంతకాలంగా హాఫీజ్‌పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా అఖిల ప్రియ కుటుంబానికి, ప్రవీణ్ రావు కుటుంబానికి గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాండ్ వ్యవహారంలోనే ముగ్గురినీ కిడ్నాప్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments