తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ మృతి

  • IndiaGlitz, [Tuesday,April 27 2021]

మాజీ పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎం.సత్యనారాయణ రావు (88) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి 2:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. నేటి మధ్యాహ్నం జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఎంఎస్ఆర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఎంఎస్‌ఆర్ 14 జనవరి, 1934లో కరీంనగర్ జిల్లా వెదిరే గ్రామంలో జన్మించారు.

ఎంఎస్ఆర్ 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి ఎంపీగా ఎంఎస్‌ఆర్ గెలుపొందారు. అనంతరం మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 14 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 1980 నుంచి 83 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2000 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంఎస్‌ఆర్ పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా, 2007 తర్వాత ఆర్టీసీ చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రావు సేవలందించారు.

ఎంఎస్ఆర్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా నాయకుల అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఎమ్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని కొనియాడారు.

More News

ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి: మద్రాసు హైకోర్టు

పలు రాష్ట్రాల్లో కరోనా ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విజృంభించడానికి ఎన్నికలు కూడా కారణమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నా పేరుతో నకిలీ ఆడియోను వైరల్ చేస్తున్నారు: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరుతో ఓ ఆడియో వైరల్ అవుతోంది. సదరు ఆడియోలో లాక్‌డౌన్ రెండు నెలల పాటు ఉండబోతోందని..

'పంచతంత్రం'లో రామనాథం ఫస్ట్‌లుక్ విడుదల

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.

కరోనాతో సినీ దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ మృతి

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

వైకల్యాన్ని జయించిన వీరుడు పొట్టి వీరయ్య - రాజశేఖర్, జీవిత దంపతులు

తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అరుదైన నటుడిని కోల్పోయింది. పొట్టి వీరయ్యగా ప్రేక్షకులకు తెలిసిన గట్టు వీరయ్య ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విధితమే.