తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎం.సత్యనారాయణ రావు (88) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి 2:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. నేటి మధ్యాహ్నం జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఎంఎస్ఆర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఎంఎస్ఆర్ 14 జనవరి, 1934లో కరీంనగర్ జిల్లా వెదిరే గ్రామంలో జన్మించారు.
ఎంఎస్ఆర్ 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి ఎంపీగా ఎంఎస్ఆర్ గెలుపొందారు. అనంతరం మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 14 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 1980 నుంచి 83 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2000 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంఎస్ఆర్ పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు వైఎస్ కేబినెట్లో మంత్రిగా, 2007 తర్వాత ఆర్టీసీ చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రావు సేవలందించారు.
ఎంఎస్ఆర్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా నాయకుల అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఎమ్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని కొనియాడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout