BRS:బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు

  • IndiaGlitz, [Friday,March 22 2024]

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ ఎంపీ స్థానానికి మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 17 నియోజకవర్గాలకు గాను 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 4 స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను వెల్లడించనున్నారు.

మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీఎ్సపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తును ప్రకటించారు. అయితే పొత్తుకు పార్టీ అధినేత్రి మాయావతి ఒప్పుకోకపోటవంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

ఇక మెదక్ స్థానం నుంచి అనుహ్యంగా సిద్ధిపేట మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పేరును ఖరారు చేశారు. 1996లో గ్రూప్‌-1 ఉద్యోగం సాధించిన వెంకట్రామిరెడ్డి 2007లో ఐఏఎస్‌ హోదా పొందారు. రాష్ట్ర విభజన తర్వాత సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తింఆరు. అయితే 2021లో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదే సంవత్సరం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

13 మంది బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా..

పెద్దపల్లి(ఎస్సీ)- కొప్పుల ఈశ్వర్
మహబూబ్‌ నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి
మల్కాజ్ గిరి- రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్- ఆత్రం సక్కు
చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాబాద్
వరంగల్(ఎస్సీ )- డాక్టర్ కడియం కావ్య
జహీరాబాద్- గాలి అనిల్ కుమార్
నిజామాబాద్- బాజిరెడ్డి గోవర్ధన్
కరీంనగర్- బోయినపల్లి వినోద్ కుమార్
ఖమ్మం- నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్(ఎస్టీ)- మాలోత్ కవిత
నాగర్ కర్నూల్- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మెదక్- పి. వెంకట్రామిరెడ్డి

More News

Kejriwal:అవినీతిపై పోరాడి.. చివరకు అదే ఆరోపణలతో అరెస్టై.. కేజ్రీవాల్ ప్రస్థానం ఇదే..

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించే ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది.

Kavitha:సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు.. బెయిల్ ఇవ్వడం కుదరదన్న ధర్మాసనం..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

Kejriwal:కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఢిల్లీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు..

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.

Drug Container:వైజాగ్‌లో దొరికిన డ్రగ్స్ కంటైనర్‌తో టీడీపీ నేతలకు లింకులు..?

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ దొరకడం కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన ఓ కంటెనైర్‌లో

TDP:టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.