మాజీ హోంమంత్రి నాయిని పరిస్థితి విషమం..

  • IndiaGlitz, [Friday,October 16 2020]

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యుల ఇటీవల అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా.. నేడు ఆయన పరిస్థితి విషమించడంతో వెంటనే జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు ఆయనను అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు.

గత నెల 28న నాయిని కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరి చికిత్స పొందారు. వారం రోజుల తర్వాత ఆయన కోలుకోవడంతో పాటు పరీక్షల్లో సైతం కరోనా నెగిటివ్ రావడంతో నాయిని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు. కాగా మూడు రోజుల క్రితం ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో వెంటనే కుటుంబ సభ్యులు అపోలోకు తరలించారు. పరీక్షల్లో నాయినికి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఆ తరువాత ఆక్సీజన్ లెవల్స్ కూడా పడిపోయాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

More News

‘కేజీఎఫ్ 2’ కోసం సిద్ధమవుతున్న సంజయ్ దత్..

బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ లాక్‌డౌన్ తర్వాత షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

నితిన్‌ 'చెక్'‌.. రీస్టార్ట్‌

హీరో నితిన్‌ కోవిడ్‌ ముందు వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే కోవిడ్‌ ప్రభావంతో సినిమాల షూటింగ్స్‌ ఆగిన సంగతి తెలిసిందే.

మరో సినిమాను ఖరారు చేసిన నాగశౌర్య

యువ కథానాయకుడు నాగశౌర్య వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. శుక్రవారం రోజున తన కొత్త చిత్రాన్ని నాగశౌర్య అనౌన్స్‌ చేశారు.

'మోసగాళ్లు'కు వెంకీ వాయిస్‌ ఓవర్‌

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం ‘మోస‌గాళ్లు’.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంపు..

ఎల్‌ఆర్‌ఎస్ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం రాత్రి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.