అనారోగ్యంతో జార్జ్ పెర్నాండెజ్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర మాజీమంత్రి జార్జ్ మాథ్యూ పెర్నాండెజ్(88) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆల్జిమర్స్తో బాధపడుతున్న జార్జ్ గత కొన్ని రోజులుగా స్వైన్ ఫ్లూ సోకిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జార్జ్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఫెర్నాండెజ్ మృతికి పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జార్జ్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
పొలిటికల్ ఎంట్రీ..
1930 జూన్ 3న కర్ణాటకలోని మంగళూరులో ఆయన జన్మించిన ఆయన.. కార్మిక సంఘాల్లో కీలకంగా పనిచేశారు. జనతాదళ్‌లో జార్జ్ క్రియాశీలకంగా వ్యవహరించారు. 1994లో సమతా పార్టీని ఆయన స్థాపించిన ఆయన.. 2009 ఆగస్టు నుంచి 2010 జులై వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. కాగా.. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయంలో జార్జ్.. రక్షణ శాఖతో పాటు సమాచార, పరిశ్రమల, రైల్వే శాఖలకు ఆయన మంత్రిగా పనిచేశారు. మొత్తం ఏడు సార్లు ఈయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1977 ఈయన ఎంపీగా గెలిచిన అనంతరం ఓ కేసు విషయమై కొద్దిరోజుల పాటు జైలుజీవితం గడపాల్సి వచ్చింది. ఎన్డీఏలో ఆయన కీలకనేతగా.. దివంగత ప్రధాని వాజ్‌పేయీకి విధేయుడిగా ఉన్నారు.
జార్జ్ పరిశ్రమల శాఖమంత్రిగా ఉన్నప్పుడు అమెరికన్ కంపెనీలైన ఐబీఎమ్, కోకా కోలాలను ఇండియాకు రప్పించడంలో ముఖ్య భూమిక పోషించారని నేతలు చెప్పుకుంటూ వుంటారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.. జార్జ్‌ను పుట్టుకతో అబద్ధికుడు (కాగ్నినెంటల్ లయ్యర్) పిలిచేవారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జార్జ్‌ను ఎమర్జెన్సీ సమయంలో ‘ప్రజాస్వామ్య చాంపియన్’గా ఉన్నారని అభివర్ణించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments