KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చికిత్స..

  • IndiaGlitz, [Friday,December 08 2023]

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైంది. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లోని బాత్‌రూమ్‌లో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో కాలికి పంచె తగలడంతో, కేసీఆర్ కాలు జారి పడినట్లు తెలుస్తోంది. ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలియగానే కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఆసుపత్రికి చేరుకుని తెల్లవారుజామున దాకా అక్కడే ఉండారు. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి నిలకడగా ఉందని.. కాసేపట్లో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌.. ప్రగతి భవన్‌ నుంచి ఫామ్‌హౌస్‌ చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో అక్కడే సమావేశమయ్యారు. గత రెండు రోజుల నుంచి ప్రజలు అక్కడికి భారీగా తరలివచ్చి ఆయనను కలిశారు. త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయని.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని చెబుతూ వస్తున్నారు.

కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగరేసి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓడిపోయి హ్యాట్రిక్ సీఎం కాలేకపోయారు. మ్యాజిక్ ఫిగర్ 60 సీట్ల కన్నా 21 సీట్లు తక్కువగా రావడంతో బీఆర్ఎస్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది.

More News

Ayyanna Patrudu: లోకేష్‌కు సొంత పార్టీలోనే తీవ్ర అవమానం.. అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు..!

తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పార్టీలో యువనేత నారా లోకేష్ పెత్తనంపై సీనియర్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Telangana Ministers: తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు.. హోంమంత్రి ఎవరంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం కొత్త ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు.

Daggubati Abhiram:ఓ ఇంటివాడైన దగ్గుబాటి అభిరామ్.. ఫొటోలు వైరల్..

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన మరో యువ హీరో ఓ ఇంటి వాడయ్యాడు.

Revanth Reddy: ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ముందుగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు.

Chandrababu:బీజేపీకి భయపడిన చంద్రబాబు.. ప్లేటు ఫిరాయింపు..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.