KCR:ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్

  • IndiaGlitz, [Friday,December 15 2023]

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ య‌శోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని త‌న సొంతింటికి వెళ్లారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్‌రావు, ఎంపీ సంతోష్‌ కుమార్ ఉన్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పడంతో ఆయన అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయనకు సాధారణ నొప్పి మాత్రమే ఉందని.. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. అయితే కొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందన్నారు. ఇక కేసీఆర్ చికిత్సకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని ఆకాంక్షించారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. సీతక్క, పొన్నం ప్రభాకర్ తదిరత నేతలు కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు. అలాగే సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా గులాబీ అధినేతను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

కాగా డిసెంబర్ 7న ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నివాసంలో కేసీఆర్ కాలు జారి కింద పడ్డారు. ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకోగానే పరీక్షలు నిర్వహించిన వైద్యులు తుంటి ఎముక విరిగిందని గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి హిప్ బోన్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం వాకర్ సాయంతో కొద్ది దూరం నడిపించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే వైద్యుల సమక్షంలో ఆయన చికిత్స తీసుకున్నారు.

More News

Bigg Boss Telugu 7 : పాత టాస్క్‌లతో కొత్త గేమ్స్ ఆడించిన బిగ్‌బాస్.. ఒకరి కోసం ఒకరు కష్టపడ్డ కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ 7 తెలుగు ఈ వారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. గత వారం శోభాశెట్టి ఎలిమినేట్ కాగా..

KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదింపు.. గులాబీ శ్రేణులు ఆగ్రహం..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసిన ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

KCR:కాసేపట్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోంది. వారం రోజులుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో

Bunny Vasu:రాజకీయాల్లోకి నిర్మాత బన్నీ వాసు.. జనసేన ప్రచారం విభాగం ఛైర్మన్‌గా నియామకం..

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి.

Pawan Kalyan:ఒక్కసారి జనసేనను నమ్మండి.. ప్రజలకు పవన్ కల్యాణ్‌ విజ్ఞప్తి

ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వండని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ఒక్కసారి మాటిస్తే వెనక్కి వెళ్లనని