తాడేపల్లిగూడెం సభకు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ ఏర్పాటు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో రాజకీయాలు తారాస్థాయి చేరాయి. ఇప్పటికే పలు విడతల్లో అధికార వైసీపీ కొంత మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజగా టీడీపీ-జనసేన కూడా ఏకంగా 118 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించి జోరు పెంచింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఇదే ఊపులో ఈనెల 28న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యాయి. తాజాగా ఈ సభ నిర్వహణకు జనసేన- తెలుగుదేశం సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కమిటీలో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, ఎం.వి.సత్యనారాయణ రాజు.. జనసేన పార్టీ నుంచి కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చాగంటి మురళీకృష్ణ, రత్నం అయ్యప్ప ఉన్నారు. సభ ఏర్పాట్లను ఈ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తారని తెలిపారు. సభకు వచ్చే అందరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.
ఉమ్మడి బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసైనికులు భారీ తరలిరానున్నారని నేతలు ప్రకటించారు. ఈ వేదికపై 175 నియోజకవర్గాల నుండి 500 మంది టీడీపీ- జనసేన నేతలు పాల్గొంటారని తెలిపారు. ఏకంగా ఆరు లక్షల మంది ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభతో సీఎం జగన్ వెన్నులో వణుకు పుట్టేలా చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఈ సభలో ప్రకటించే అవకాశం ఉంది.
కాగా ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాతో వైసీపీ నేతలకు వణుకు మొదలైందని విమర్శిస్తున్నారు. అందుకే సీట్ల కేటాయింపులో తమ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జగన్‌ను గద్దె నుంచి దించడమతే తమ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏకైక లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం ఏపీ రాజకీయ చరిత్రలోనే ఈ సభ నిలిచిపోతుందని టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments