హీరోపై ఫోర్జ‌రీ కేసు

  • IndiaGlitz, [Friday,August 30 2019]

త‌మిళ హీరో శింబుపై ఫోర్జ‌రీ కేసు న‌మోదైంది. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో శింబు మానాడులో న‌టించాల్సింది. కానీ ఆయ‌న కార‌ణంగా సినిమాకు ప‌లు ర‌కాలుగా ఆల‌స్యం జ‌రుగుతుండ‌టంతో ఆయ‌న్ని తీసేశారు. దాంతో శింబు త‌న త‌దుప‌రి సినిమా 'మ‌గామానాడు'ను అనౌన్స్ చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న థాయ్‌ల్యాండ్‌కు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న హ‌న్సిక 50వ సినిమా 'మ‌హా'లో కేమియో చేయ‌డానికి, గౌత‌మ్ కార్తిక్ త‌ర్వాతి సినిమా 'మ‌ఫ్టీ'లో న‌టించ‌డానికి అంగీక‌రించారు. ఆయ‌న ఇచ్చిన కాల్షీట్ టైమ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ శింబు ఎవ‌రికీ అందుబాటులోకి రాలేదు.

గౌత‌మ్ కార్తిక్ సినిమాకు జ్ఞాన‌వేల్ రాజా నిర్మాత‌. ఆయ‌న కూడా శింబును రీచ్ కాలేక‌పోయారు. ఇదే ప‌రిస్థితిని అంత‌కు ముందు 'మానాడు' నిర్మాత సురేష్ కామాక్షి కూడా ఎదుర్కొన్నారు. వారితో పాటు 'వినై తాండి 2 ' నిర్మాత విజ‌య్ రాఘ‌వేంద్ర‌, స్క్రీన్ సీన్ ఓన‌ర్ భూమి బిల్డ‌ర్స్ సుంద‌ర్ .... ఇలా అంద‌రూ క‌లిసి నిర్మాత‌ల మండ‌లిలో శిండు మీద కంప్లెయింట్ చేశారు.

అంతే కాదు, చెన్నై పోలీసు క‌హిష‌న‌ర్‌కు అత‌ని మీద ఫోర్జ‌రీ కేసు కూడా లాడ్జ్ చేశారు. ఇప్ప‌టిదాకా థాయ్‌ల్యాండ్‌లో ఉంటూ ఎవ‌రి ఫోనూ అటెండ్ చేయ‌ని శింబును త్వ‌ర‌లోనే పోలీసులు చెన్నైకి ర‌ప్పిస్తార‌ని స‌మాచారం.

సుంద‌ర్.సి. ద‌ర్శ‌క‌త్వంలో 'వందా రాజావాత్తాన్ వ‌రువేన్‌' త‌ర్వాత శింబు ఇప్ప‌టిదాకా మ‌రే సినిమానూ చేయ‌లేదు. ఈ చిత్రంలో శింబు స‌ర‌స‌న మేఘా ఆకాష్‌, కేథ‌రిన్ ట్రెస్సా నాయిక‌లుగా న‌టించారు.

ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో శింబు త‌మ్ముడికి వివాహం జ‌రిగింది. శింబు ఇంత‌కు పూర్వం న‌య‌న‌తార‌తో ప్రేమ‌లో ఉన్నారు. ఆ త‌ర్వాత హ‌న్సిక‌తోనూ ప్రేమాయ‌ణం న‌డిపారు. విడిపోయిన త‌ర్వాత ఆయ‌న న‌య‌న‌తార‌తో ఓ సినిమాలో న‌టించారు. ఇప్పుడు హ‌న్సిక‌తోనూ ఓ సినిమా చేయ‌డానికి సంత‌కం చేశారు.