Taraka Ratna : తారకరత్న కోసం ఫారిన్ నుంచి డాక్టర్లు.. నారాయణ హృదయాలయలోనే చికిత్స

  • IndiaGlitz, [Sunday,February 12 2023]

గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే వున్నప్పటికీ.. ఆయన ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. కాకపోతే.. తొలినాళ్లతో పోలిస్తే తారకరత్న పరిస్థితి కొంచెం మెరుగ్గా వుందని ఆయనను పరామర్శించిన వారు మీడియాతో చెబుతున్నారు. వైద్యులు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు.

గుండె, నాడీ సమస్యలకు ఫారిన్ వైద్యుల చికిత్స :

టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న కోలుకుని తిరిగి మామూలు మనిషి కావాలని ఆకాంక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆయన కోసం ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తున్నారు. అయితే తారకరత్నను మెరుగైన చికిత్స నిమిత్తం విదేశాలకు తరలించే అవకాశం వుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై నందమూరి కుటుంబం గానీ, నారాయణ హృదయాలయ కానీ స్పందించలేదు. అయితే తారకరత్నకు విదేశీ వైద్యుల ద్వారా అత్యాధునిక చికిత్స అందుతోందట. ఈ విషయాన్ని నందమూరి రామకృష్ణ ఆదివారం తెలిపారు. గుండె సంబంధిత సమస్యను క్లియర్ చేస్తూనే.. నాడీ సమస్యలకు వారు చికిత్స చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:

కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో నిన్న యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.

More News

Rashmika Mandanna:రష్మికకు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ అపార్ట్‌మెంట్స్ అంటూ ప్రచారం.. శ్రీవల్లి కామెంట్ ఇదే

రష్మిక మందన్నా.. ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా చలామణి అవుతున్న నటి.

Samantha: సమంత ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే.. ఆ థెరపీ చేయించుకుంటున్న సామ్

హీరోయిన్‌గా తొలి నుంచి వున్న ఫేమ్‌కి తోడు, నాగచైతన్యకి విడాకులు, ఇటీవల అనారోగ్యం బారినపడటంతో సమంత ఏం చేసినా..

Suresh Babu: రూ.18 కోట్ల భూ వివాదం.. బెదిరింపులు : దగ్గుబాటి సురేష్ బాబు, రానాలపై కేసు నమోదు

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన కుమారుడు హీరో రానాలు వివాదంలో చిక్కుకున్నారు.

Ram Prasad: మెడికల్ క్యాప్‌తో ఆటో రామ్‌ప్రసాద్‌, క్యాన్సర్ అంటూ ప్రచారం.. స్పందించిన జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్.. ఈ షో గురించి తెలుగు నాట తెలియని వారుండరు. ప్రతి గురు, శుక్రవారాల్లో

Nandamuri Ramakrishna:నందమూరి కుటుంబానికి తప్పిన పెను విషాదం.. తృటిలో బయటపడ్డ రామకృష్ణ

నందమూరి కుటుంబానికి టైం బాగోనట్లుగా వుంది. ఇప్పటికే జానకీరామ్, హరికృష్ణ, కంఠమనేని ఉమామహేశ్వరి మరణాలతో