ఫోర్బ్స్ టాప్ 100 .. మహేష్‌ను క్రాస్ చేసిన ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ 2019 సంవత్సరానికిగానూ ఎంటర్టైన్మెంట్ రంగంలో అత్యంత ప్రభావంతమైన టాప్ 100 లిస్టులను విడుదల చేసింది. ఇందులో కేవలం వారి ఆదాయాన్నే కాకుండా వారికున్న క్రేజ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ లిస్టులో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(రూ.35కోట్లతో) 44వ స్థానాన్ని దక్కించుకున్నారు. సూపర్‌స్టార్ మహేశ్(రూ.35 కోట్లతో) 54వ స్థానం దక్కించుకున్నారు.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (రూ.21.5కోట్లతో) 77వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫోర్బ్స్ లిస్టులోనే లేని ప్రభాస్ సూపర్‌స్టార్ మహేశ్‌ని దాటేశారు. మహేష్ గత ఏడాది 34వ స్థానంలో నిలవగా..ఈ ఏడాది 44వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ రంగంలో టీం ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి(రూ.252.72 కోట్లతో) అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన సల్మాన్‌ఖాన్(రూ. 229.25 కోట్లతో) మూడో స్థానంలో నిలవగా అక్షయ్ కుమార్(రూ. 293.25 కోట్లతో) రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. బిగ్ బి అమితాబ్(రూ.239.25కోట్లతో) నాలుగో స్థానంతో సరి పెట్టుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె 8వ స్థానంలో నిలవగా.. ఆలియా భట్ 10వ స్థానంలో నిలిచారు. ఈ సెలబ్రిటీల ఆదాయం ఈ ఏడాది 22 శాతం పెరిగినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments