రవితేజ కోసం..
Send us your feedback to audioarticles@vaarta.com
కొందరికి కొన్ని టైటిల్స్ భలేగా మ్యాచ్ అవుతాయి. బొద్దుగుమ్మ రాశీ ఖన్నాకి కూడా అంతే. ఆమె రెండో చిత్రం 'జోరు' ఏమంటు చేసిందో.. అందులోని టైటిల్ సాంగ్ ఏమంటు పాడిందో గానీ.. ఆ తరువాత కెరీర్‌లో జోరు బాగానే పెరిగింది. కట్ చేస్తే.. ఈ ఏడాదిలో గోపీచంద్‌తో 'జిల్', రామ్‌తో 'శివమ్'.. అతి త్వరలో రవితేజతో 'బెంగాల్ టైగర్'.. ఇలా ముచ్చటగా మూడు సినిమాలతో సందడి చేసేసింది ఈ 'ఊహలు గుసగుసలాడే' కథానాయిక.
జిల్, శివమ్ కోసం సోలో హీరోయిన్‌గా సందడి చేసిన రాశీ.. బెంగాల్ టైగర్ కోసం మాత్రం తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తమ్మీద రవితేజలాంటి అగ్ర కథానాయకుడు కోసం.. ఇప్పటివరకు చేయని రెండో నాయిక వేషాన్ని సైతం వేసింది రాశీ. సోలో హీరోయిన్‌గా గత రెండు చిత్రాల పరంగా దక్కని హిట్.. సెకండ్ హీరోయిన్‌గానైనా రాశీకి దక్కుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com