'భరత్ అనే నేను' కోసం 25 ఏళ్ళ త‌రువాత..

  • IndiaGlitz, [Thursday,April 19 2018]

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘జంబలకిడి పంబ’ (1993) సినిమాతో టాలీవుడ్‌కు నిర్మాతలుగా పరిచయమయ్యారు డి.వి.వి.దానయ్య, భగవాన్, పుల్లారావు. శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో నరేష్, ఆమని జంటగా నటించారు. ఈ కామెడీ ఫిల్మ్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించింది ఈ త్రయం. క‌ట్ చేస్తే.. ఆ త‌రువాత యూనివ‌ర్శ‌ల్ మీడియా, డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై సోలో ప్రొడ్యూస‌ర్‌గా ప‌లు చిత్రాల‌ను నిర్మించారు డి.వి.వి.దానయ్య. 

తాజాగా.. మహేశ్ బాబు హీరోగా ఆయ‌న నిర్మించిన ‘భరత్ అనే నేను’ ఈ నెల 20న‌ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. నిర్మాత‌గా దాన‌య్య‌కు ఇది సిల్వ‌ర్ జూబ్లీ ఇయ‌ర్ కావ‌డం విశేషం. ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం ఏమిటంటే.. దానయ్య తొలి చిత్రంలో  హీరోయిన్‌గా నటించిన ఆమ‌ని.. దాదాపు 25 సంవత్సరాల తర్వాత దాన‌య్య నిర్మించిన‌ ‘భరత్ అనే నేను’లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ‌రి..‘జంబలకిడి పంబ’లాగే ‘భరత్ అనే నేను’ కూడా సంచలనాలకు తెరతీస్తుందేమో చూడాలి.

More News

అమితాబ్ పాత్ర‌ను పెంచే ఆలోచ‌న‌లో చిరు?

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంట‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’.

'మహానటి' లో స‌మంత‌కి న‌త్తి ఉందా?

న‌టీమ‌ణి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’.

రామ్ చరణ్ కోసం బాలీవుడ్‌ ఫిట్‌నెస్ ట్రైనర్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో

తార‌క్ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కొడుకుగా..

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు నవీన్ చంద్ర.

హాలీవుడ్ చిత్రాల్ని మ‌రిపించేలా అత్యద్భుతమైన గ్రాఫిక్స్ చిత్రం సంజీవని మే నెలాఖ‌రున విడుద‌ల

గాల్లో ఎగిరే బ‌ల్లులు, తెలివైన కోతులు, ప‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై క‌నిపించి మ‌న‌ల్ని వాటి న‌ట‌న‌తో